Reliance Jio Recharge Plans: దేశంలో టాప్ ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నుంచి అనేక ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ అవసరాలకు అనుగుణంగా వివిధ కాల పరిమితులతో (Validity) ట్రూ 5G అన్‌లిమిటెడ్ ప్లాన్స్, ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్, డేటా బూస్టర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్స్, యాన్యువల్ ప్లాన్స్, డేటా ప్యాక్స్, ఇంటర్నేషనల్ రోమింగ్, ఐఎస్‌డీ, టాప్-అప్, వాల్యూ ప్లాన్స్‌ను జియో అందిస్తోంది. వీటితోపాటు వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వాన్ని పొందే సూపర్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వాన్ని అందించే జియో రీఛార్జ్ ప్లాన్‌లు (Jio recharge plans that offer free Netflix subscription)
రూ. 1799 ప్రి-పెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్‌తో మీరు 84 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు. నెట్‌ఫ్లిక్స్ ప్రాథమిక సభ్యత్వం (Netflix Basic Subscription) ధర నెలకు రూ. 199. కానీ, ఈ ఫ్రీ ఆఫర్ జియో 1799 ప్రి-పెయిడ్ ప్లాన్‌తో లభిస్తుంది.
రూ. 1799 ప్రి-పెయిడ్ ఫీచర్లు:
84 రోజుల వ్యాలిడిటీప్రతిరోజూ 3 GB డేటాఅపరిమిత 5G యాక్సెస్అపరిమిత వాయిస్ కాలింగ్రోజుకు 100 SMSజియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌కు యాక్సెస్ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్
రూ. 1299 ప్రి-పెయిడ్ ప్లాన్
తక్కువ బడ్జెట్ ఉన్న వారి కోసం ఈ ప్లాన్ డిజైన్ చేశారు. దీనిలోనూ, నెలకు రూ. 149 విలువ గల నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 1299 ప్రి-పెయిడ్ ప్లాన్ ఫీచర్లు
84 రోజుల వ్యాలిడిటీప్రతిరోజూ 2 GB డేటాఅపరిమిత వాయిస్ కాలింగ్రోజుకు 100 SMSనెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్
మరో ఆసక్తికర కథనం: భారీగా తగ్గిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
రూ. 749 పోస్ట్-పెయిడ్ ప్లాన్
రూ. 749 ప్లాన్ పోస్ట్-పెయిడ్ యూజర్లకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో మీరు నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (Amazon Prime Subscription)ను కూడా ఉచితంగా పొందుతారు.
రూ. 749 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఫీచర్లు
ప్రతి నెలా 100 GB డేటాకుటుంబం కోసం 3 అదనపు సిమ్‌లుఅపరిమిత వాయిస్ కాలింగ్ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ఉచితంగా అమెజాన్ ప్రైమ్ ప్రి-పెయిడ్
జియో ప్లాన్‌లు ఎందుకు ప్రత్యేకమైనవి?
జియో ప్లాన్‌లలో కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా వినోదం కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సర్వీస్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీకి యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కలిసి జియో ప్యాకేజీలను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. అదే సమయంలో, దేశంలో రిలయన్స్ జియోకు పోటీ ఇస్తున్న ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea - Vi) ప్లాన్‌లు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. వీటిలోనూ చాలా ప్లాన్‌లు వినియోగదారులకు ఉచింగా నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని అందిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: కస్టమర్లకు అలెర్ట్ - డిసెంబర్‌లో బ్యాంక్‌లు 17 రోజులు పని చేయవు