Camera Cleaning Tips: స్మార్ట్ ఫోన్ కెమెరా క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే లెన్స్ పోయినట్లే!

Smartphone Camera Cleaning: స్మార్ట్ ఫోన్ కెమెరా క్లీన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. లేకపోతే కెమెరా లెన్స్ అనేవి కచ్చితంగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Continues below advertisement

Smartphone Camera Cleaning Tips: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు కేవలం కాల్స్ చేయడానికి లేదా మెసేజింగ్ చేయడానికి మాత్రమే కాదు. మన మెమొరీస్‌ను సేవ్ చేయడానికి, గొప్ప చిత్రాలను తీయడానికి కూడా స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తాం. కానీ మంచి ఫొటోలను తీయడానికి ఫోన్ కెమెరా లెన్స్‌ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. దాన్ని తప్పుగా శుభ్రం చేస్తే కెమెరా పాడైపోవచ్చు లేదా దాని నాణ్యత దెబ్బతినవచ్చు.

Continues below advertisement

సరైన క్లాత్ వాడాలి
ఫోన్ కెమెరా లెన్స్ చాలా సున్నితంగా ఉంటుంది. దీన్ని శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించండి. ఇది లెన్స్‌ను శుభ్రపరచడమే కాకుండా గీతలు పడకుండా కాపాడుతుంది. ఏదైనా కఠినమైన క్లాత్ లేదా టిష్యూని ఉపయోగించవద్దు. ఇది లెన్స్‌ను స్క్రాచ్ చేయనుందని అనుకోవచ్చు.

కెమెరా లెన్స్‌పై అధిక ఒత్తిడి పెట్టకూడదు
శుభ్రపరిచేటప్పుడు లెన్స్‌ను స్మూత్‌గా డీల్ చేయాలి. ఎక్కువ ఒత్తిడిని పెట్టడం వలన లెన్స్ విరిగిపోవడం లేదా దాని కోటింగ్ దెబ్బతినడం వంటివి జరుగుతాయి.

లిక్విడ్ క్లీనర్లను జాగ్రత్తగా వాడాలి
కెమెరా లెన్స్‌ను శుభ్రం చేయడానికి చాలా మంది సాధారణ నీటిని లేదా ఏదైనా ఇతర ద్రవాలను ఉపయోగిస్తారు. ఇది లెన్స్‌కు హానికరం. లిక్విడ్ క్లీనర్ ఉపయోగించాల్సి వస్తే ఎలక్ట్రానిక్ డివైజ్ క్లీనర్ లేదా లెన్స్ క్లీనర్ మాత్రమే ఉపయోగించండి.

Also Read: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!

మీ వేళ్లతో లెన్స్‌ను తాకవద్దు
చాలా సార్లు మనకు తెలియకుండానే మన వేళ్లతో లెన్స్‌ని తాకుతుంటాం. ఇలా చేయడం ద్వారా లెన్స్‌పై నూనె, ధూళి పేరుకుపోతుంది. ఇది ఫొటో నాణ్యతను పాడు చేస్తుంది.

దుమ్ము తొలగించడానికి బ్లోవర్ వాడాలి
లెన్స్‌పై దుమ్ము పేరుకుపోయినట్లయితే దాన్ని శుభ్రం చేయడానికి ఎయిర్ బ్లోయర్‌ని ఉపయోగించండి. ఊదడం ద్వారా దానిని శుభ్రం చేయడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఇది లెన్స్‌లోకి తేమ ప్రవేశించడానికి కారణం కావచ్చు.

ఫోన్ కెమెరాను శుభ్రపరిచేటప్పుడు ఈ జాగ్రత్తలను అనుసరించాలి. తద్వారా మీ కెమెరా చాలా కాలం పాటు సురక్షితంగా, ప్రభావవంతంగా ఉంటుంది. మంచి ఫోటో తీయడానికి కెమెరా శుభ్రంగా, మంచిగా ఉండటం చాలా ముఖ్యం.

Also Read: 200 జీబీ డేటా అందించే జియో ప్లాన్ - ఎన్ని డేస్ వ్యాలిడిటీ, మిగతా లాభాలు ఏంటి?

Continues below advertisement