Jio Rs 899 Recharge Plan: టెలికాం కంపెనీ జియో ఇటీవల తన అనేక ప్లాన్‌లను ఖరీదైనదిగా చేసింది. ఈ టారిఫ్ పెంపుతో జియో వినియోగదారులు ఇప్పుడు తక్కువ ధరలో మరిన్ని ప్రయోజనాలతో కూడిన ప్లాన్ల కోసం చూస్తున్నారు. వినియోగదారులకు రోజువారీ డేటాతో పాటు అదనపు డేటా సదుపాయాన్ని అందించే జియో బెస్ట్ ప్లాన్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.


జియో అందిస్తున్న ఈ ప్లాన్ రోజువారీ డేటా యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ.899గా ఉంది. కంపెనీ ఈ ప్లాన్‌ ద్వారా గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్‌లో మీరు రోజువారీ డేటాతో పాటు 20 జీబీ అదనపు డేటాను ఉచితంగా పొందుతున్నారు. దీంతో మీరు ప్రతిరోజూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను పంపగలరు.



Also Read: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?


ప్లాన్ వ్యాలిడిటీ ఎంత ఉంది?
జియో రూ.899 ప్లాన్‌లో మీకు 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది. జియో అందిస్తున్న ఈ ప్లాన్ వినియోగదారులకు ప్రతిరోజూ 2 జీబీ డేటాను అందిస్తుంది. అయితే మీకు రోజువారీ డేటాతో పాటు 20 జీబీ అదనపు డేటా ఉచితంగా అందిస్తారు. దీని ప్రకారం 90 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ మీకు మొత్తం 200 జీబీ డేటాకు యాక్సెస్ ఇస్తుంది.


ఈ ప్లాన్ కింద మీరు డేటా కొరతను ఎదుర్కోరు. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కి తగ్గుతుంది. డేటాతో పాటు మీరు ఈ జియో ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. అలాగే మీరు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను పంపగలరు. మీరు లాంగ్ వ్యాలిడిటీ అందించే ఇటువంటి ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో రిలయన్స్ జియోనే నంబర్ వన్ టెలికాం కంపెనీగా ఉంది. కానీ రేట్లు పెంచాక బీఎస్ఎన్‌ఎల్‌కు ఇతర సంస్థల వినియోగదారులు క్యూ కడుతున్నారు.



Also Read: ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!