Amazon Black Friday Sale 2024 Offers: అమెజాన్ మనదేశంలో మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. నవంబర్ 28వ తేదీ నుంచే ఈ సేల్ ప్రారంభం అయింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, గేమింగ్ కన్సోల్స్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటి వాటిపై వినియోగదారులకు డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులతో ట్రాన్సాక్షన్ చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ కూడా లభించనున్నాయి. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ జరగనుంది.
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024 ఆఫర్లు ఇవే...
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీపై భారీ ఆఫర్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.1,24,999 కాగా, సేల్‌లో రూ.74,999కే కొనుగోలు చేయవచ్చు. యాపిల్, ఐకూ, వన్‌ప్లస్, రియల్‌మీ, రెడ్‌మీ, టెక్నో వంటి ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఏకంగా 40 శాతం వరకు తగ్గింపు లభించనుంది.
మ్యాక్‌బుక్‌పై కళ్లు చెదిరే ఆఫర్...
అమెజాన్‌లో యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (ఎం1, 2020 మోడల్) ల్యాప్‌టాప్‌పై మంచి ఆఫర్ ఉంది. దీని లిస్టింగ్ ధర రూ.89,900 కాగా, అమెజాన్‌లో కేవలం రూ.59,990కే కొనుగోలు చేయవచ్చన్న మాట. అంటే ఏకంగా రూ.30 వేల వరకు డిస్కౌంట్‌ను అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో పొందవచ్చు.
Also Read: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
స్మార్ట్ టీవీలపై 65 శాతం తగ్గింపు
అమెజాన్‌లో స్మార్ట్ టీవీలపై ఏకంగా 65 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే ప్లేస్టేషన్ 5పై ఏకంగా రూ.7,500 ఫ్లాట్ డిస్కౌంట్ అందించారు. అమెజాన్ బ్రాండ్ల ఉత్పత్తులపై కనీసం 50 శాతం తగ్గింపును బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో అందిస్తున్నారు. రోబోట్ వాక్యూమ్ క్లీనర్ల వంటి ప్రీమియం కిచెన్ అప్లయన్స్‌పై కనీసం 50 శాతం, అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవీ డివైస్‌లపై 25 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.
ధరలు తగ్గించడంతో పాటు ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, వన్ కార్డ్ లాంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అమెజాన్ కో బ్రాండెడ్ కార్డులతో షాపింగ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఏకంగా ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.
మనదేశంలో అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇంతవరకు ఈ దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఒక్కసారి కూడా మనదేశంలో బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహించలేదు. ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే సేల్‌కు గతంలో యూఎస్‌లో ఉన్నంత ఆదరణ ఇక్కడ ఉండేది కాదు. ఇక్కడ చాలా మందికి బ్లాక్ ఫ్రైడే సేల్ గురించి ఎక్కువ అవగాహన కూడా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్ గురించిన వివరాలు టైర్ 2, 3 నగరాలకు కూడా పాకాయి. దీని కారణంగా అమెజాన్ కూడా మొదటి సారి ఈ సేల్‌ను నిర్వహిస్తుంది.
Also Read: సూపర్ కెమెరా, భారీ బ్యాటరీలతో లాంచ్ అయిన రెడ్‌మీ కే80 సిరీస్ - ధర ఎంతంటే?