Black Friday Offers in India: బ్లాక్ ఫ్రైడే డీల్స్ కింద తన డెస్క్ టాప్‌లు, ల్యాప్‌టాప్స్‌పై హెచ్‌పీ భారీ ఆఫర్లను అందించడం ప్రారంభించింది. ఈ ఆఫర్ల ద్వారా వినియోగదారులు కొన్ని ఎంపిక చేసిన మోడల్స్‌ను మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. రూ.79,999కి పైబడిన పీసీలపై ఈ ఆఫర్ వర్తించనుంది. ఓమెన్, విక్టస్, స్పెక్టర్, పెవిలియన్, ఎన్వీ సిరీస్ ల్యాప్‌టాప్‌లపై ఈ ఆఫర్ వర్తించనుంది. అయితే ఈ ఆఫర్లు కొద్ది కాలం మాత్రమే ఉండనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు యూజర్లకు మాత్రమే విడుదల కానుంది.
హెచ్‌పీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ (HP Black Friday Deals)
బ్లాక్ ఫ్రైడే డీల్స్ మనదేశంలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రూ.79,999 పైబడి ట్రాన్సాక్షన్ చేసిన వారికి రూ.5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. అలాగే రూ.99,999 పైబడి ట్రాన్సాక్షన్ చేసిన వారికి రూ.8,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
Also Read: సూపర్ కెమెరా, భారీ బ్యాటరీలతో లాంచ్ అయిన రెడ్‌మీ కే80 సిరీస్ - ధర ఎంతంటే?
హెచ్‌పీ వరల్డ్ స్టోర్స్, హెచ్‌పీ ఆథరైజ్డ్ ఆఫ్‌లైన్ సెల్లర్స్ వద్ద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ప్రెస్ రిలీజ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఓమెన్, విక్టస్, స్పెక్టర్, పెవిలియన్, ఎన్వీ సిరీస్ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేవారికి రూ.8,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది.
హెచ్‌పీ విక్టస్, హెచ్‌పీ ఓమెన్ 16, హెచ్‌పీ ఓమెన్ 17, హెచ్‌పీ ఓమెన్ ట్రాన్సెండ్ 14 వంటి గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, హెచ్‌పీ ఓమెన్ 35ఎల్ వంటి గేమింగ్ డెస్క్‌టాప్‌లపై కూడా హెచ్‌పీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌పీ ఓమెన్ ట్రాన్సెండ్ 14లో షాడో బ్లాక్ ఆప్షన్ ధర రూ.1,74,999 నుంచి ప్రారంభం కానుంది.
వీటితో పాటు హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్, హెచ్‌పీ ఓమ్నీబుక్ ఎక్స్, హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14, హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360, హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360, హెచ్‌పీ ఎలైట్‌బుక్ అల్ట్రా జీ1క్యూ, హెచ్‌పీ డ్రాగన్‌ఫ్లై జీ4 ల్యాప్‌టాప్‌లపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. వీటిలో హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 అల్ట్రా 7 ధర రూ.1,81,999 నుంచి ప్రారంభం కానుంది. హెచ్‌పీ ఓమ్నీబుక్ ఎక్స్ ధర రూ.1,39,999గా ఉంది.
నిజానికి అమెరికాలో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు మొదట అందుబాటులో ఉండేవి. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ పేరిట ఒక పండుగ జరుగుతుంది. ఆ పండుగ సందర్భంగా అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ జరిగేవి. ఈ సేల్స్‌లో మంచి ఆఫర్లు అందించేవారు. ఒకప్పుడు ఈ సేల్‌లో తక్కువ ధరకు వస్తువులు కొనుగోలు చేసి అమెరికా నుంచి ఇండియాలో ఉన్న తమ ఇళ్లకు పంపేవారు. కానీ ఇప్పుడు మనదేశంలో కూడా బ్లాక్ ఫ్రైడే సేల్స్ ప్రారంభం అయిపోయాయి.
Also Read: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!