Challenges in Developing an HIV/AIDS Vaccine : ప్రాణాంతక వ్యాధుల్లో HIV ఒకటి. దీనిబారిన పడితే కాస్త లేట్ అయినా ప్రాణాలు పోవాల్సిందే. మరి ఇలాంటి అంటువ్యాధికి ఎందుకు ఇప్పటివరకు వాక్సిన్ కనుక్కోలేకపోయారో తెలుసా? కొత్తగా పుట్టుకొస్తున్న ఎన్నో వైరల్‌ను అరికట్టి.. ప్రజలను రక్షించగలిగారు కానీ.. ఈ హెచ్ఐవీ, ఎయిడ్స్ కోసం వాక్సిన్ కనిపెట్టలేకపోయారు. దాని వెనుక రీజన్స్ ఏంటి? HIV/AIDS రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాప్తి కారకాలు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
వాక్సిన్ ఎందుకు కనుక్కోలేకపోయారంటే..
HIVకి క్యూర్ ఏమి లేదు. చికిత్సతో సమయాన్ని పెంచుకోవచ్చు కానీ.. ప్రాణాలు కాపాడలేము. చికిత్సలో భాగంగా antiretroviral therapy (ART) చేస్తారు కానీ.. ఇది వైరస్‌ను మేనేజ్ చేయడానికే హెల్ప్ చేస్తుంది. నాశనం చేయడానికి కాదు. అంటువ్యాధి అయిన HIVకి టీకా కనుక్కోకపోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
HIV/AIDSకి వ్యాక్సిన్ కనుక్కోవడం చాలా ఛాలెంజ్‌తో కూడిన టాస్క్. ఇమ్యూనిటీపై ఎటాక్ చేసే ఈ వైరస్‌కి చెక్ పెట్టడానికి సైంటిఫిక్‌గా ఎన్నో కారకాలు అడ్డువస్తున్నాయి.
పరివర్తన : హెచ్ఐవీ మ్యూటేషన్ రేట్ చాలా వేగంగా ఉంటుంది. ఈ వైరస్ ఈజీగా పరివర్తన చెందుతుంది. అంటే ఇది తన జెనిటిక్స్ని చాలా త్వరగా మార్చేస్తుంది. దీనివల్ల వాక్సిన్‌తో రోగనిరోధక శక్తిని బిల్డ్ చేయడం కష్టమవుతుంది.
స్ట్రైన్స్ ఎక్కువ : ఈ వైరస్‌లో అనేక రకాల జాతులు ఉన్నాయి. వాటన్నింటిని రక్షించగలిగే సింగిల్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడం కష్టతరంగా ఉన్నట్లు నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
DNAలోకి జెనిటిక్స్ : వాక్సిన్ కనుక్కోలేకపోవడానికి ఇదో పెద్ద రీజన్. ఎందుకంటే HIVకి హోస్ట్ కణాలలో కలిసిపోయే సామర్థ్యం ఉంది. అంటే HIV తన జెనిటిక్ పదార్థాన్ని.. హెస్ట్ సెల్ అయిన DNAలోకి చేర్చేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థను గుర్తించడం, వైరస్‌పై దాడి చేయడం కష్టతరం అవుతుంది.
ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్. అలాగే వాక్సిన్ కనుక్కోలేకపోవడానికి రోగనిరోధక(Immunological) రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే..
వైరస్ రెస్పాన్స్ : రోగనిరోధక వ్యవస్థపై హెచ్ఐవీ ఎలా స్పందిస్తుందనేది తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. పరిశోధనలు గణనీయంగా జరుగుతున్నా.. వైరస్ రెస్పాన్స్‌పై అవగాహన పరిమితంగానే ఉంది.
ప్రతిరోధకాలు : శరీరంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రతిరోధకాలు ప్రేరేపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. HIV కాంప్లెక్స్ ఎన్వలప్ ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను తటస్థం చేసే యాంటీబాడీలను ఉత్పత్తి చేయడాన్ని కష్టం చేస్తుంది.
ఒకవేళ HIVకి వాక్సిన్ కనుక్కోవాలంటే.. దానిలో యాంటీబాడీ హ్యూమరల్ సెల్, సెల్యూలార్ ఇమ్యూనిటీని పెంచేదై ఉండాలి. అలాగే టీకా భద్రత, సమర్థతను నిర్ధారించగలగాలి. HIV వ్యాక్సిన్ క్లినకల్ ట్రయల్స్ పెద్ద ఎత్తున చేయాలి. అనంతరం వారు సురక్షితంగా, ప్రభావవంతగా ఉన్నారని గుర్తిస్తేనే వాక్సిన్ను ప్రజలకు అందించాలి. ఇప్పటివరకు కొన్ని వాక్సిన్లు కనుగొన్నారు కానీ.. వాటి ఫలితాలు కాస్త ఎఫెక్టివ్‌గా మాత్రమే ఉంటున్నాయి. పూర్తిగా నయం చేసేవాటిపైనే ఇంకా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి.
వ్యాప్తి కారకాలు ఇవే జాగ్రత్త
చాలామంది HIV లైంగికపరంగానే సంక్రమించే వ్యాధి అనుకుంటారు. కానీ ఇది చాలా రకాలు వ్యాపిస్తుంది. ముందుగా ప్రొటెక్షన్ లేకుండా పాల్గొనే లైంగిక చర్య ద్వారా ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఎయిడ్స్ ఉన్న వ్యక్తికి ఉపయోగించిన సిరంజీలు, ఇంజెక్షన్లు మరో వ్యక్తికి వినియోగించడం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. తల్లికి హెచ్ఐవీ ఉంటే గర్భంలోని శిశువుకు కూడా ఇది వస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన కూడా ఇది సోకుతుంది. అలాగే బ్లడ్ డొనేట్ చేసే వ్యక్తికి ఈ వైరస్ ఉంటే.. దానిని తీసుకున్న వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకుతుంది.
హెచ్ఐవీని కంట్రోల్ చేసేందుకు mRNA-based వాక్సిన్లను, వెక్టార్ బేస్డ్ వాక్సిన్లను, యాంటీబాండీ బేస్డ్ వాక్సిన్లపై ఇప్పుడు పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందుకే వాక్సిన్ వచ్చేలోపు ఈ వ్యాధిపై అవగాహనలు కల్పిస్తూ.. నియంత్రించేందుకు ఎయిడ్స్ డే నిర్వహిస్తున్నారు.
Also Read : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024 థీమ్ ఇదే.. చికిత్సలేని ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే