World AIDS Day 2024 Theme : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ సమస్యతో ఇబ్బంది పడుతోన్న నేపథ్యంలో.. చికిత్స లేని ఈ మహమ్మారి గురించి అవగాహన కల్పిస్తూ ఈ తేదీని సెలబ్రేట్ చేస్తున్నారు. AIDS (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్) సమాజంపై, కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడమే దీని లక్ష్యం. అసలు దీని ప్రభావమేంటి? ఈ ఎయిడ్స్​ డేని సెలబ్రేట్ చేయడం ఎందుకు అవసరం? దీని చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


వేలల్లో కేసులు.. లక్షల్లో మరణాలు


ప్రపంచవ్యాప్తంగా 2023లో 13 లక్షల మంది కొత్తగా HIV బారిన పడ్డారు. ఇండియాలో 66,400 కొత్తకేసులు గుర్తించారు. నమోదు కానీ కేసులు కూడా ఉన్నాయట. UNAIDS ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 38.4 మిలియన్ల మంది HIV/AIDSతో ఇబ్బందిపడుతున్నారని తెలిపింది. అదే సంవత్సరంలో 1.5 మిలియన్ల కొత్త ఇన్​ఫెక్షన్లు గుర్తించారు. సుమారు 6,50,000 మంది మరణించారు.


ఒకప్పుడు దీనిని నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. సరైన చికిత్స లేదు కాబట్టి.. దానిని నియంత్రించడమే మన ముందున్న అతిపెద్ద టాస్క్. ఈ అవసరాన్ని గుర్తించి.. ప్రతి సంవత్సరం ఈ ఎయిడ్స్​ డేని నిర్వహిస్తున్నారు. ఈ దీర్ఘకాలిక వ్యాధిని ఎలా నివారించాలి? రోగనిర్ధారణ, నిర్వహణ, అంటువ్యాధి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. 


ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం చరిత్ర ఇదే


ఎయిడ్స్​ డేని 1988లో నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రారంభించింది. ఎయిడ్స్​పై అవగాహన కల్పించేందుకు, ఎయిడ్స్​తో మరణించినవారిని గౌరవించడమే లక్ష్యంగా ప్రారంభమైంది. HIV/AIDS (UNAIDS)పై ఉమ్మడి ఐక్యరాజ్య సమతి 1996లో దీనిని ముమ్మరం చేసింది. అవగాహన కల్పించడమే కాకుండా.. మానవహక్కులు, లింగ సమానత్వం వంటి అంశాలను కూడా దీనిలో కలిపి.. ఎయిడ్స్​ డేని ముందుకు తీసుకెళ్తున్నారు. 



ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024 థీమ్


ప్రతి సంవత్సరం కొత్త థీమ్​తో ఎయిడ్స్​ డేని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం “Take the Rights Path“ అనే థీమ్​ని తీసుకువచ్చారు. ప్రజల హక్కులను ఉల్లంఘించే చట్టపరమైన, సామాజిక అడ్డంకులను తొలగించడమే దీని లక్ష్యం. HIV ఉన్న వ్యక్తులకు సామాజిక మద్ధతు అందించాలనే థీమ్​తో ముందుకు వెళ్తున్నారు. సాజికంగా ఎయిడ్స్ ఉన్నవారిని వెలివేయడం కాకుండా.. వారి హక్కులు గుర్తిస్తూ.. నియంత్రణ చర్యలు ఫాలో అవ్వడమే దీని ప్రధాన ఉద్దేశం. 2030 నాటికి AIDSను అంతం చేయడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వెళ్తోంది. 


చికిత్స ఉందా?


ఇప్పటికీ ఎయిడ్స్​ను నివారించే ట్రీట్​మెంట్ రాలేదు. పరిశోధలను అంతగా ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి చికిత్స లేని ఈ మహమ్మారిని నివారించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రొటెక్షన్స్ ఉపయోగించడం, సెక్సువల్ ట్రాన్స్​మిట్టెడ్ డీసీస్(STD)​ టెస్ట్​లు చేయించుకోవడం, హెచ్​ఐవీ టెస్ట్​లు చేయించుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. ఎక్కువమందితో కాకుండా ఒక్కరే పార్టనర్ ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటే ఎయిడ్స్​ రాకుండా నియంత్రించవచ్చు.



Also Read : లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే