Avinash Become TTF Contender Task : బిగ్ బాస్ ఇంట్లో టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మాజీ కంటెస్టెంట్లు వచ్చి ఇంటి సభ్యులతో ఆటలు ఆడిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో అఖిల్, హారికలు వచ్చి ఆటలు ఆడించారు. అలా ఆ ఆటల్లో రోహిణి గెలిచి టికెట్ టు ఫినాలే రేసులోని మొదటి కంటెండర్‌గా నిలిచింది. బుధవారం నాటి ఎపిసోడ్‌లో మానస్, ప్రియాంక వచ్చారు. ఇక రెండో కంటెండర్‌గా అవినాష్ గెలిచాడు. బిగ్ బాస్ పెట్టిన టాస్కులు ఏంటి? మానస్ ప్రియాంకలు ఆడించిన ఆటలు ఏంటి? విష్ణు చెప్పిన స్టోరీ ఏంటో ఓ సారి చూద్దాం.
స్కిల్, స్ట్రెంథ్ అనే వాటిని మానస్, ప్రియాంక ఎంచుకున్నారు. కంటెండర్‌గా ఎంచుకోవాలంటే ఎంటర్టైన్ చేయాలని అన్నారు. దాని కోసం మానస్, ప్రియాంక ఆటలు ఆడించారు. ఇందులో ప్రేరణ, నబిల్‌ను వారిద్దరూ ఎంచుకున్నారు. నబిల్, ప్రేరణ కలిసి అవినాష్, పృథ్వీల్ని లెక్కలు వేసుకుని మరీ ఎంచుకున్నారు. ఈ క్రమంలో మొదటి ఆటగా సుడోకు పెట్టాడు బిగ్ బాస్. ఇందులో అందరూ ఓడిపోతారు. దీంతో బిగ్ బాస్ కాస్త హింట్ ఇస్తారు. ఆ తరువాత అవినాష్ ఫస్ట్ ఆ సుడోకిని క్లియర్ చేసి విన్ అవుతాడు. అలా ఫస్ట్ వచ్చినందుకు అవినాష్ ఓ ప్రయోజనం కలిగింది.
Vishnu Priya Breakup Story
స్కిల్ టెస్ట్‌లో భాగంగా నేర్పుగా సాగు స్కోర్‌ను పొందు అంటూ వెరైటీగా క్రికెట్ ఆడించాడు. నబిల్‌కి నాలుగు బంతులు ఇవ్వగా.. 24 స్కోర్ చేశాడు. ప్రేరణ, పృథ్వీలు 30 రన్స్ చేస్తారు. అవినాష్ 8 బంతుల్లో 43 స్కోర్ చేసి విన్ అవుతాడు. అలా రెండో కంటెండర్‌గా అవినాష్ నిలుస్తాడు. నబిల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి రేసు నుంచి తప్పించేస్తారు. ఇక విష్ణు తన బ్రేకప్ స్టోరీని పృథ్వీకి చెప్పేసింది. నేను నా ఎక్స్ నుంచి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను.. అని చెప్పింది. అతడ్ని మర్చిపోయేందుకునే పృథ్వీ చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
నా కోసం తప్పులు చేశాడు.. అవి తెలిస్తే భరించలేను అని దాచి పెట్టాడు.. కానీ తెలిశాక నిజంగానే భరించలేకపోయా.. రెండు సార్లు తప్పులు చేశాడు.. అవి నాకు చెప్పేంత గట్స్ లేవు.. అలాంటప్పుడు వద్దు అని అనుకున్నాను.. కానీ అతడు నా మదర్ ప్లేస్ తీసుకున్నాడు.. చూడకుండా ఉండలేకపోతోన్నా.. నా మమ్మీలా ప్రేమించాడు.. నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాడు.. అంటూ తన ఎక్స్ గురించి విష్ణు ప్రియ చెప్పింది. తానే బ్రేకప్ చెప్పిందట. కానీ అతడు మాత్రం ఇంకా విష్ణునే కోరుకుంటున్నాడట. బయట ప్రేమలో విఫలమైన విష్ణు.. బిగ్ బాస్ ఇంట్లో కూడా పృథ్వీ రూపంలో ప్రేమను వెతుక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది.
Also Read : వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?