Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో టికెట్ టు ఫినాలే టాస్కు జరిపించేందుకు వితిక, పునర్నవి వచ్చి ఇంటి సభ్యులతో ఆటలు ఆడించారు. విన్ అయిన నిఖిల్ టికెట్ టు ఫినాలే మూడో కంటెండర్‌గా నిలిచాడు.

Continues below advertisement

Nikil Won as 3rd Ticke To FInale Task Contender : బిగ్ బాస్ ఇంట్లో టికెట్ టు ఫినాలే టాస్కు జరుగుతోంది. ఈ టాస్కుని జరిపించేందుకు పాత కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపిస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలో అఖిల్, హారిక, మానస్, ప్రియాంకలు వచ్చి ఆటలు ఆడించారు. అలా రోహిణి, అవినాష్‌లు కంటెండర్లుగా నిలిచారు. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో వితిక, పునర్నవి వచ్చి ఆటలు ఆడించారు. ఇక చివరి కంటెండర్, మూడో కంటెండర్‌గా ఎవరు అయ్యారు? ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

Continues below advertisement

వితిక, పునర్నవి వచ్చి ఇంటి సభ్యులతో ట్రూత్ అండ్ డేర్ ఆట ఆడించారు. కాసేపు అందరితో ఎంటర్టైన్ చేయించారు. ఈ క్రమంలోనే విష్ణు మీద పృథ్వీకి ఉన్న ఫీలింగ్ ఏంటో బయట పెట్టించారు. నాకు ఆమె జస్ట్ ఫ్రెండ్ అని పృథ్వీ.. నాక్కూడా పృథ్వీ ఫ్రెండ్.. కొన్ని సార్లు కాస్త ఫ్రెండ్ కంటే ఎక్కువే అని చెప్పింది విష్ణు. అలా ఈ ట్రూత్ అండ్ డేర్ గేమ్ తరువాత జారుతూ గెలువు అనే టాస్క్ పెట్టాడు. ఇందుకోసం గౌతమ్, నిఖిల్‌లను పునర్నవి, వితిక ఎంచుకుంటారు. నిఖిల్, గౌతమ్ కలిసి ప్రేరణ, పృథ్వీలను సెలెక్ట్ చేసుకుంటారు.

అలా ఈ నలుగురూ కలిసి ఆట ఆడతారు. అందరి కంటే ఎక్కువగా పది పాయింట్లతో పృథ్వీ ముందుంటాడు. తొమ్మిది పాయింట్లతో నిఖిల్ రెండో స్థానంలోకి వస్తాడు. ఐదు పాయింట్లతో ప్రేరణ, గౌతమ్ సరిసమానంగా ఉంటారు. పృథ్వీ రూల్స్ పాటించలేదని నిఖిల్‌కి ఫస్ట్ ప్లేస్, పృథ్వీకి రెండో ప్లేస్ ఇస్తారు సంచాలకులైన వితిక, పునర్నవి. దీంతో పృథ్వీ వారిని నిలదీస్తాడు. రూల్స్ పాటించలేదు కాబట్టి అలా చేశామని వారు చెబుతారు. ప్రేరణకి మూడో స్థానం, గౌతమ్‌కి నాలుగో స్థానం ఇస్తారు. ఆ తరువాత రోహిణి, అవినాష్, తేజలు కామెడీ స్కిట్ చేస్తారు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు.

రెండో టాస్క్ కోసం బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నలుగుర్ని కాకుండా.. ముగ్గురితో ఆట ఆడించాలని, ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలని సంచాలకులకు చెబుతాడు.  ప్రేరణ రూల్ బ్రేక్ చేసింది కదా అని ఆమెను తప్పిస్తారు. ఈ నిర్ణయంతో ప్రేరణ వ్యతిరేకిస్తుంది. కానీ ప్రేరణ వాదనను బిగ్ బాస్ కూడా వినలేదు. బ్లాక్ బ్యాడ్జ్ ధరించండని బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో ప్రేరణ ఏడ్చేస్తుంది. నిఖిల్, పృథ్వీ, గౌతమ్‌లు డోంట్ లెట్ ది బాల్ డ్రాప్ అనే టాస్క్ ఆడతారు. అందులో నిఖిల్ విన్ అవుతాడు. మూడో కంటెండర్‌గా నిలుస్తాడు. ఈ టాస్కుల్లో సంచాలక్‌లు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. వితిక, పునర్నవి  వెళ్లే టైంలో ప్రేరణ ఎడమొహం, పెడమొహంగానే ఉంది. పృథ్వీ రూల్ సరిగ్గా పాటించలేదు అని సంచాలక్‌లకు చెప్పిన ప్రేరణకే చివరకు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసింది. మరి టికెట్ టు ఫినాలే రేసులో రోహిణి, అవినాష్, నిఖిల్ పోటి పడితే.. ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి.

Also Read : అదరగొట్టేసిన అవినాష్.. ఓహో అసలు కథ ఇదా?.. పృథ్వీ వెనకాల విష్ణు ప్రియ పడటానికి కారణం ఇదేనా

Continues below advertisement
Sponsored Links by Taboola