Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ షర్ట్ బటన్ కావాలనే కాంచన ఊడదీసేస్తుంది. కార్తీక్ తల్లిని పిలిచి బటన్ కుట్టమని అంటే కాంచన వాళ్లు దీపని పంపిస్తారు. దీప వెళ్తుంది. దీప కార్తీక్ దగ్గరకు వెళ్లి అమ్మా అమ్మా అని శౌర్యలా పిలుస్తారు ఏంటి.. నన్ను పిలవొచ్చు కదా అని అంటుంది. దానికి కార్తీక్ నువ్వు వస్తావని అనుకోలేదు అని అంటాడు. బటనే కదా వస్తాను అని దీప అంటే ఈ సారి పిలుస్తాలే అని కార్తీక్ అంటాడు. దానికి దీప ప్రతీ సారి బటన్ ఊడిపోదు అని అంటుంది. కార్తీక్ నవ్వుకుంటాడు.
బటన్ కుట్టడానికి కార్తీక్ షర్ట్ తీయబోతే దీప వద్దని కార్తీక్ ఒంటి మీద షర్ట్ ఉన్నప్పుడే బటన్ కుడుతుంది. కార్తీక్ దీపని చూస్తూ ఉండిపోతాడు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇక తేరుకొని దీప వెళ్తుంటే కార్తీక్ థ్యాంక్స్ చెప్తాడు. విలువ కట్టలేనంత విలువైన స్నేహం మనది అని వేలెత్తి చూపలేనంత పవిత్రమైన స్నేహం మనది అని దీన్ని పది కాలాల పాటు పదిలంగా దాచుకుంటే చాలు నా జన్మ సార్థకం అయిపోతుందని అంటుంది దీప. దానికి కార్తీక్ నువ్వు అన్నది నిజమే దీప మనది బాధ్యతలతో కూడిన బంధం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది అని అనుకుంటాడు.
మరోవైపు అనసూయ కుభేర్ ఫొటో కింద పడి ఫ్రేమ్ లూజ్ అయిందని టేపుతో అతికించడానికి బయటకు తెస్తుంది. ఇక దాసు ఇంటికి వస్తాడు. దాసు దీపని చూసి ఆ ఇంటి వారసురాలు దీపే అయింటుందా అని అనుకుంటాడు. ఇక దీపతో మాట్లాడుతాడు. దీప తల్లిదండ్రుల పేర్లు అడిగితే అంబుజవల్లి, కుభేరుడు అని దీప చెప్తుంది. ఇక దాసు అనసూయ చేతిలో కుభేర్ ఫొటో చూసి జ్యోత్స్న చెప్పింది కరెక్టే దీప కుభేర్ కూతురే అని అనుకుంటాడు. ఇక దీప ఇంటి వారసురాలా కాదా అని తెలుసుకోవడానికి దీపతో నీకు ఎవరైనా తోడబుట్టిన వాళ్లు ఉన్నారా అని అడుగుతారు దీప లేరని చెప్తుంది.
దాసు: అంటే దీప ఆ ఇంటి వారసురాలే. కానీ దీప కుభేర కూతురు కూడా అయిండొచ్చు కదా ఆ విషయం అనసూయని అడగాలి అనుకొని కావాలనే బ్యాగ్ మర్చిపోయి బయటకు వెళ్తాడు. అనసూయ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తుంది. అందులో కుభేర్ స్కెచ్ చూసి మా తమ్ముడు మీకు తెలుసా అని అడుగుతుంది. దాసు తెలుసని అంటాడు. కొన్నేళ్ల క్రితం బస్ స్టాండ్‌లో కుభేర్‌కి ఓ పాప దొరికింది. ఆ పాప.
అనసూయ: షాక్ అయిపోతూ.. ఆ పాప దీపని మీకు తెలుసా. ఆ బస్ స్టాండ్‌లో దొరికిన పాప దీపని మీకు తెలుసా.
దాసు: మనసులో వారసురాలు దొరికేసింది. దశరథ్, సుమిత్రల కూతురు దొరికేసింది. నాకు ఆ విషయం తెలీదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పావు.
జ్యోత్స్న: పారిజాతం కొడుకు ఇక్కడికి వచ్చాడేంటి. దీప తండ్రి ఫొటో నీ దగ్గరకు ఎలా వచ్చింది అంటే సమాధానం చెప్పలేదు మరి దాన్ని పట్టుకొని బావ ఇంటికి వచ్చాడు. అనసూయతో దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకు ఆ డ్రాయింగ్‌తో ఏం పని.
అనసూయ: బాబు ఈ మాట దీపతో అనకండి దానికి నిజం తెలీదు తను ఇంకా కుభేర కన్న కూతురు అనుకుంటుంది ఇది తెలిస్తే అది తట్టుకోలేదు. ఈ బొమ్మ పట్టుకొని మీరు ఎందుకు తిరుగుతున్నారు. దీప కన్నవాళ్లు ఎవరో ఎవరికీ తెలీదు.
దాసు: తెలుసు దేవుడికి ఆయనే న్యాయం చేస్తాడు. ఆ దేవుడు నా లాంటి దాసుడికి తెలుస్తుంది. నేను అదే పనిలో ఉన్నాను. నేను కనిపెడతాను.
జ్యోత్స్న: ఈ పారిజాతం కొడుకుకి కుభేర్‌కి ఏదో సంబంధం ఉంది అదేంటో కనిపెట్టాలి.
అనవసరంగా తమ్ముడికి ఇచ్చిన మాట తప్పానే అని అనసూయ తలపట్టుకుంటుంది. మరోవైపు కార్తీక్ దీప బటన్ కుట్టడం గుర్తు చేసుకొని నువ్వు ఒక్కడుగు ముందుకు వేస్తే మన అందమైన ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని అనుకుంటాడు. ఇంతలో జ్యోత్స్న కారు అడ్డంగా పెడుతుంది. నువ్వు నీ సతీమణి కలిసి నా జీవితాన్ని యాక్సిడెంట్ చేస్తున్నారు. నువ్వు అంటే నాకు ప్రేమ బావ అని నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. నాకు నువ్వు కావాలి బావ అని అంటుంది. పాప కోసమే దీపని పెళ్లి చేసుకున్నావ్ కదా అంటే దానికి కార్తీక్ నేను దీప మీద ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను అని అంటాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారితో తన కొటేషన్ టెండర్‌లో వేయించిన లక్ష్మీ.. చివరి నిమిషంలో ట్విస్ట్!