Most Common Used Passcodes: ఇంటర్నెట్ వాడకంతో పాటు, సైబర్ దాడుల కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ తన నివేదికలో 2024 సంవత్సరంలో సైబర్ దాడుల కేసులు 33 శాతం వరకు పెరిగాయని నివేదించింది. సైబర్ నేరగాళ్లు వ్యాపారాలు, ప్రభుత్వ రంగాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. చాలా మంది సులభమైన పిన్‌లు లేదా పాస్‌కోడ్‌లను ఉపయోగిస్తున్నారని నివేదికలో వెల్లడించారు. సులభమైన పిన్‌ల కారణంగా హ్యాకర్లు వ్యక్తుల పాస్‌కోడ్‌లను సులభంగా ఛేదించగలరు.


సైబర్ నేరగాళ్లు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు
సైబర్ నేరస్థులు మీరు సాధారణ లేదా బలహీనమైన పిన్‌ ఉపయోగిస్తే ఆ పాస్‌కోడ్‌ను సులభంగా ఛేదించగలరు. ఒక సైబర్ సెక్యూరిటీ అధ్యయనం మొత్తంగా 34 లక్షల పిన్ కోడ్‌లను పరిశీలించింది. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే అత్యంత సాధారణ పిన్ ఏది అని గమనించారు. చాలా మంది వ్యక్తులు సులువుగా గుర్తుండేందుకు సాధారణ పిన్‌లను ఉపయోగిస్తున్నారని, ఇది మీ అకౌంట్ లేదా డివైస్‌ను హ్యాకింగ్ బారిన పడే అవకాశాలను పెంచుతుందని పేర్కొన్నారు. అలాగే ఎక్కువగా ఉపయోగించే, తక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాను కూడా విడుదల చేశారు.


ఎక్కువగా ఉపయోగించే పాస్‌కోడ్‌లు ఇవే...
- 1234
- 1111
- 0000
- 1212
- 7777
- 1004
- 2000
- 4444
- 2222
- 6969



Also Read: 200 జీబీ డేటా అందించే జియో ప్లాన్ - ఎన్ని డేస్ వ్యాలిడిటీ, మిగతా లాభాలు ఏంటి?


తక్కువగా ఉపయోగించే పాస్‌కోడ్‌లు ఇవే...
- 8557
- 8438
- 9539
- 7063
- 6827
- 8093
- 0859
- 6793
- 0738
- 6835


పిన్ మారుస్తూ ఉండాలి...
మీరు సులభమైన పాస్‌కోడ్‌ను ఉపయోగిస్తుంటే వెంటనే దాన్ని మార్చండి. సులభమైన పాస్‌కోడ్‌ని ఉపయోగించడం వల్ల కలిగే నష్టం ఏంటంటే ఎటువంటి టూల్స్ లేకపోయినా దాన్ని సులభంగా గెస్ చేసే అవకాశం ఉంటుంది. అలా జరిగితే మీ డేటా హ్యాకర్ల దగ్గరికి వెళ్లిపోతుంది. మీ పుట్టిన తేదీ, వాహనం నంబర్ వంటి నంబర్‌లను ఉపయోగించకుండా ఉండండి. బలమైన పాస్‌వర్డ్‌ను సృష్టించండి. దీని వల్ల మీ పాస్‌కోడ్‌ను ఎవ్వరూ సులభంగా క్రాక్ చేయలేరు కాబట్టి ఎప్పటికప్పుడు మార్చుకోండి. మీ పాస్‌కోడ్‌ను సురక్షితంగా ఉంచడానికి మీరు అదనపు సెక్యూరిటీని కూడా సెట్ చేయవచ్చు. మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే మీ పిన్‌ని మార్చండి. వెంటనే మీ బ్యాంక్‌ని సంప్రదించండి.


ప్రస్తుతం సైబర్ నేరాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా మనదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఏ కొత్త సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చినా ప్రభుత్వాలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఆయా నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కారణంగా చాలా వరకు సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతోంది. కానీ అంత లోపే సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసంతో ట్రాక్ ఎక్కుతున్నారు. మనదేశంలో ఫెడ్ఎక్స్, డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్ ఇలా ఎన్నో సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ప్రజల్లో వీటిపై అవగాహన కొరవడుతోంది. ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రజలు తమంతట తాము జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం అవుతోంది. ప్రజల్లో అవగాహన వస్తే దాదాపు 90 శాతం వరకు సైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పడటం పక్కా అని చెప్పవచ్చు.



Also Read: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!