Expensive Android Smartphone: మీరు స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే వారయితే ప్రత్యేక ఫీచర్లతో కూడిన ఖరీదైన ఫోన్‌లను కొనుగోలు చేయాలని మీకు అనిపించవచ్చు. గొప్ప టెక్నాలజీ, అద్భుతమైన డిజైన్ కారణంగా తరచుగా ప్రజలు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడతారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


షావోమీ రెడ్‌మీ కే20 ప్రో సిగ్నేఛర్ ఎడిషన్ (Xiaomi Redmi K20 Pro Signature Edition)
ఇది షావోమీ త్వరలో లాంచ్ చేయబోయే స్మార్ట్ ఫోన్. దీని ధర సుమారు రూ. 4,80,000 వరకు ఉండవచ్చు. ఇందులో 6.39 అంగుళాల స్క్రీన్, 2.8 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్, వెనకవైపు 48 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించవచ్చు.


లంబోర్ఘిని 88 టౌరీ (Lamborghini 88 Tauri)
ఈ జాబితాలోని రెండో ఫోన్ పేరు లంబోర్ఘిని 88 టౌరీ. ఈ ఫోన్ ధర రూ.3,60,000గా ఉంది. ఇందులో ఐదు అంగుళాల స్క్రీన్, డ్యూయల్ సిమ్, 3జీ, 4జీ, వైఫై, స్నాప్‌డ్రాగన్ 801, క్వాడ్ కోర్ ప్రాసెసర్ కోసం 2.3 గిగాహెర్ట్జ్ చిప్‌సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.



Also Read: 2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!


హువావే మేట్ 30 ఆర్ఎస్ పోర్షే డిజైన్ (Huawei Mate 30 RS Porsche Design)
హువావే మేట్ 30 ఆర్ఎస్ పోర్షే డిజైన్ కూడా మంచి కాస్ట్లీ ఫోన్లలో ఒకటి. హువావే అనేది ఒక చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 2,14,990గా ఉంది. ఈ ఫోన్ ఇంకా లాంచ్ కాలేదు. ఇందులో డ్యూయల్ సిమ్, 3జీ, 4జీ, 5జీ, వోల్టే, వైఫై, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉండనున్నాయి. ఇది కాకుండా 2.86 గిగాహెర్ట్జ్ కిరిన్ 990 ఆక్టా కోర్ చిప్‌సెట్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.53 స్క్రీన్, 40 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో సహా అనేక ప్రత్యేక స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.


హువావే మేట్ ఎక్స్2 (Huawei Mate X2)
హువావే మేట్ ఎక్స్2 కూడా కాస్ట్లీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 3జీ, 4జీ, 5జీ, వోల్టే, వైఫై, ఎన్ఎఫ్‌సీ వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, ఈ ఫోన్ పెద్ద 8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫోల్డబుల్ అంటే డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్. ఈ ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు అందించారు. ఈ ఫోన్ ధర రూ.2,04,999గా ఉంది.



Also Read: స్మార్ట్ ఫోన్ కెమెరా క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే లెన్స్ పోయినట్లే!