అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) వచ్చే నెల మొదటి వారంలో వివాహం చేసుకోనున్నారు. శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి పెళ్లి శుభలేఖ చూశారా? 


నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ఆశీస్సులతో!
అక్కినేని కుటుంబం శుభలేఖలు పంచడం మొదలు పెట్టింది. సినిమా పరిశ్రమలోని ప్రముఖులను, బంధు మిత్రులను వివాహానికి తప్పకుండా రావాలని ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ అందిస్తున్న వివాహ ఆహ్వాన పత్రిక చిత్రసీమ వర్గాలలో వైరల్ అవుతోంది.


నాయనమ్మ అన్నపూర్ణ - తాతయ్య నాగేశ్వరరావు, అమ్మమ్మ రాజేశ్వరి - తాతయ్య రామానాయుడు ఆశీస్సులతో ఈ వివాహం జరిపిస్తున్నట్లు శుభలేఖ ప్రారంభంలో అక్కినేని కుటుంబం పేర్కొంది. డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8.13 గంటలకు శుభ ముహూర్తాన లక్ష్మీ శోభితతో తమ కుమారుడు నాగచైతన్య వివాహం జరుగుతుందని, అన్నపూర్ణ స్టూడియోస్ అందుకు వేదిక కానుందని లక్ష్మి - శరత్, నాగార్జున - అమల దంపతులు తెలిపారు. శుభలేఖలో ఒక్కరి ఇంటి పేరు కూడా లేదు. అందరి పేర్లను మాత్రమే పేర్కొన్నారు. 


Also Read: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య



శోభిత ఫ్యామిలీ శుభలేఖలో ఏముందో చూశారా?
అక్కినేని కుటుంబం ఇస్తున్న శుభలేఖలో నాగ చైతన్య పేరు ముందు ఉంది. వరుడు కుటుంబం ఇచ్చే శుభలేఖ ఆ విధంగానే ఉంటుంది. వధువు కుటుంబం పంచే శుభ లేఖలో అమ్మాయి పేరు ముందు ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీ ఇస్తున్న శుభలేఖలో లక్ష్మీ శోభిత అని పేర్కొంటే... ధూళిపాళ ఫ్యామిలీ ఇస్తున్న శుభలేఖలో అమ్మాయి పేరును శోభిత (Sobhita Dhulipala) అని మాత్రమే రాశారు.






శోభిత తల్లితండ్రులు ధూళిపాళ వేణుగోపాల రావు, సంత కామాక్షి తమ కుమార్తె వివాహానికి తప్పకుండా రావాలని ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు శుభలేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?



శోభిత ధూళిపాళతో కలిసి అక్కినేని నాగ చైతన్య గతంలో విదేశాలకు వెళ్లారు. అక్కడ ఒక షెఫ్ దిగిన ఫోటోలో వాళ్ళిద్దరూ కనిపించడంతో పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులలో సైతం 'ప్రేమలో ఉన్నారా?' అని సందేహాలు మొదలయ్యాయి. తమ ప్రేమ విషయం గురించి ఇద్దరు మౌనం వహించారు తప్ప ఎప్పుడూ ఏ విషయం బయట పెట్టలేదు. నిశ్చితార్థం జరిగిన తర్వాత అధికారికంగా అందరికీ తమ అనుబంధం గురించి చెప్పారు. తొలుత విదేశాలలో పెళ్లి జరుగుతుందని వార్తలు వినిపించినప్పటికీ... ఏఎన్ఆర్ ఆశీస్సులు ఉంటాయని అన్నపూర్ణ స్టూడియోలో వివాహానికి ఏర్పాట్లు చేశారు.


Also Readబికినీలో దిశా పటానీ - 'కంగువ'లో బోల్డ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన లేడీ... ఆ ఫోటోలు చూశారా?