ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu)ను విజయ దశమి రోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కలిశారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద సహాయక చర్యలకు కోటి రూపాయలు విరాళాన్ని చిరు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అమౌంట్ చెక్ ఇవ్వడానికి చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో చిరంజీవి ధరించిన షూస్ రేటు ఎంతో తెలుసా? 


చూడటానికి సింపుల్... కానీ రేటు ఎక్కువే!
సినిమాల్లో క్యారెక్టర్లకు తగ్గట్టు చిరంజీవి రెడీ అవుతారు. కానీ, బయట? మెగాస్టార్ చాలా సింపుల్. హడావిడి లేకుండా సింపుల్ డ్రసింగ్ స్టైల్ మైంటైన్ చేస్తారు. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సమయంలో ఆయన ధరించిన షూస్ చూడడానికి సాధారణంగానే ఉన్నాయి. కానీ వాటి రేటు మాత్రం ఎక్కువే. 






గుచ్చి బ్రాండ్ (Gucci)కి సంబంధించిన ఫుట్ వేర్ చిరంజీవి ధరించారు. అవి షూస్ కింద కనిపిస్తాయి. కానీ షూస్ కాదు. ముందు నుంచి చూస్తే షూస్ అన్నట్టే ఉంటాయి. వెనుక వైపు స్లిప్పర్స్ కింద ఉంటాయి. ఈ తరహా వాటిని Mules అంటారు. చిరు కాలికి ఉన్న Gucci GG Horsebit Mules రేటు అక్షరాల లక్ష రూపాయలు. మెగాస్టార్ అంటే మినిమం ఆ మాత్రం రేంజ్ ఉండాలని ఫ్యాన్స్ అంటున్నారు.



'విశ్వంభర' టీజర్ విడుదలకు అందుకే రాలేదా?
చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'విశ్వంభర' టీజర్ విడుదల కార్యక్రమం విజయ దశమి సందర్భంగా శనివారం ఉదయం బాలనగర్ విమల్ థియేటర్ లో జరిగింది. ఆ కార్యక్రమానికి చిరంజీవి వస్తారని అభిమానులు ఆశించారు. అయితే ,ఆయన రాలేదు. చంద్రబాబు నాయుడును కలిసే కార్యక్రమం ఉండడం వల్ల సినిమా వేడుకకు చిరు రాలేకపోయారని ఊహించవచ్చు.


Also Readథియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బట్టబయలు చేసిన నిర్మాత భార్య



సోషియో ఫాంటసీ సినిమాగా 'విశ్వంభర' రూపొందుతోంది. ఈ జానర్ సినిమాలు చిరంజీవి ఇంతకు ముందు చేశారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా ఆయనకు భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత 'అంజి' చేశారు. మరి 'విశ్వంభర' ఏ స్థాయి విజయం అందిస్తుందో చూడాలి. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసినా... తనయుడు రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' కోసం ఆ విడుదల తేదీని త్యాగం చేశారు చిరంజీవి. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'గేమ్ చేంజర్' థియేటర్లలోకి వస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ కోసం సంక్రాంతి తేదీ త్యాగం చేశామని యూవీ క్రియేషన్స్ అధినేత విక్రమ్ రెడ్డి తెలిపారు.


Also Readవిశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?