ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ (Jani Master) ఇంట్లో పరిస్థితులు అసలు ఏం బాలేదు. వాళ్లకు బ్యాక్ టైం నడుస్తున్నట్లు ఉంది. ఆల్రెడీ ఆయన జైలుకు వెళ్లడం వల్ల కుటుంబ సభ్యులు అందరూ భావోద్వేగానికి లోను అవుతున్నారు. ఇప్పుడు మరొక బ్యాడ్ న్యూస్ వాళ్లకు రావడంతో ఏం చేయాలో పాలు పోనీ స్థితిలో ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
గుండెపోటుతో ఆసుపత్రి పాలైన జానీ తల్లి
Jani Master Mother Hospitalized: జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ ఆస్పత్రి పాలు అయ్యారు. ప్రస్తుతం ఆవిడ నెల్లూరు జిల్లాలో గల బొల్లినేని ఆసుపత్రిలో ఉన్నారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లిన అప్పటి నుంచి కొడుకు కటకటాల వెనుక ఉన్న బెంగతో ఆవిడ ఆరోగ్యం క్షీణించింది. ఈ రోజు ఉదయం ఆమెకు గుండెపోటు రావడం వల్ల కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అత్తగారిని చూడడానికి వెళ్లిన అయేషా
జానీ మాస్టర్ భార్య ఆయేషాకు అత్తగారి ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే నెల్లూరు వెళ్లారు. బీబీ జాన్ ఆరోగ్యం గురించి వైద్యులను ఆరా తీశారు. సాధారణంగా హైదరాబాదులో ఉండే ఆవిడ ఇప్పుడు కొన్ని రోజులు నెల్లూరులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్!
జానీ మాస్టర్ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉంది? వారి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? అనేది పక్కన పెడితే... ఈ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారు అని ఓ మహిళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి మీద జానీ బంధువు ఒకరు, ఆయనకు వరుసకు మేనల్లుడు అయ్యే ఓ యువకుడు కేసు పెట్టారు.
జానీ మాస్టర్ దగ్గర పని చేస్తున్న సమయంలో అవుట్ డోర్ షూటింగ్స్ చేయడం కోసం వెళ్ళినప్పుడు తనును సదరు మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఈ కేసు ఎటు వెళుతోంది? అని పలువురి మధ్య చర్చకు వస్తోంది. అమ్మాయి కేసు పెట్టిన వెంటనే ఫోక్సో చట్టం కింద జానీని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఏం చేస్తారు?అంటూ కొందరు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరి నుంచి ఆ అమ్మాయికి మద్దతుగా పోస్టులు వస్తున్నాయి. జానీ మాస్టర్ మీద అమ్మాయి కేసు పెట్టినందుకు రివర్స్‌లో జానీ బంధువు కేసు పెట్టి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం పడుతున్నారు. ఫిమేల్ అసిస్టెంట్ పెట్టిన కేసు వల్ల జైలులో ఉండాల్సి రావడమే కాదు... ఉత్తమ నృత్య దర్శకుడిగా వచ్చిన జాతీయ అవార్డును సైతం జానీ కోల్పోయాడు?
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?