మెగాస్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదల అయింది. నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ట్రైలర్‌ను విడుదల చేశారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘కోహినూర్ పార్ట్ 1’ అనే సినిమాను అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ముహూర్తం ఖరారు అయింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
‘అన్‌స్టాపబుల్’తో పండుగ తెస్తున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ముందుకు తీసుకువచ్చిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’. ఇప్పటికే మూడు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ టాక్ షోకి సంబంధించిన నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నాలుగో సీజన్ ట్రైలర్‌ను ఇప్పుడు లాంచ్ చేశారు. నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అక్టోబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సూర్యదేవర నాగవంశీలది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' చిత్రాలు ఎంత సంచలనాలు సృష్టించాయో చెప్పక్కర్లేదు. ‘టిల్లు స్క్వేర్’ అయితే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో కొత్త సినిమా రానుంది. అయితే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ‘టిల్లు 3’ అయితే కాదు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే అంశంపై ‘కోహినూర్ పార్ట్ 1’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. పేరును బట్టి ఇది ఫ్రాంచైజీ తరహా సినిమా అని చెప్పవచ్చు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2026 జనవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మెగాస్టార్ మాస్ సంభవం
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర'. విజయదశమి కానుకగా ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అది చూస్తే... మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులకు పూనకాలే. ఇది సంభవం... మెగాస్టార్ మాస్ సంభవం అని చెప్పాలి! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాలకృష్ణ - బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు..
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే కేవలం నందమూరి అభిమానుల్లో మాత్రమే కాదు... ప్రేక్షకులు అందరిలోనూ ఓ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. ఆ సినిమా ఓపెనింగ్, పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సంక్రాంతి బరిలోనే రామ్ చరణ్ సినిమా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సౌత్ ఇండియన్ స్టార్ ఫిలిం మేకర్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియా ఫిలిం 'గేమ్ చేంజర్'. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పటి సినిమా సంక్రాంతికి వాయిదా పడింది. చిత్ర నిర్మాత దిల్ రాజు ఆ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)