మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర' (Vishwambhara). విజయదశమి కానుకగా ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అది చూస్తే... మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులకు పూనకాలే. ఇది సంభవం... మెగాస్టార్ మాస్ సంభవం అని చెప్పాలి!


'విశ్వంభర'... ఊహలకు అందని రీతిలో!
చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'విశ్వంభర'. యూవీ క్రియేషన్స్ పతాకం మీద వంశీ, ప్రమోద్, విక్కీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్ మెగా అభిమానులను, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఒక కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన ఫస్ట్ లుక్ జనాలకు నచ్చింది. ఈ రోజు విడుదల చేసిన టీజర్ అంతకు మించి అన్నట్టు ఉంది. ఎగిరే గుర్రం మీద నుంచి మెగాస్టార్ చిరంజీవి వచ్చిన విజువల్స్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.


Also Read: సంక్రాంతి బరిలోనే రామ్ చరణ్ సినిమా - గేమ్ చేంజర్ విడుదలపై దిల్ రాజు ప్రకటన






సరికొత్త ప్రపంచం సృష్టించిన వశిష్ఠ
'బింబిసార'తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ మల్లిడి... మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి ఈ క్రేజీ ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర'ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు. అది టీజర్ విజువల్స్, 93 సెకన్లలో స్పష్టంగా కనిపించింది. ఇందులో టాప్ - లెవల్ వీఎఫ్ఎక్స్, హై - ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌లు, అద్భుతమైన డ్రామాతో... అన్నీ కలిపి ఇదొక విజువల్ వండర్‌గా ఉంటుందని తెలుస్తోంది. 


Also Readవిశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?



సంక్రాంతికి విడుదల కావడం లేదు!
'విశ్వంభర' సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... 'గేమ్ చేంజర్'ను ఆ తేదీకి విడుదల చేయాలని అనుకోవడంతో, చిరంజీవితో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలను 'దిల్' రాజు రిక్వెస్ట్ చేయడంతో ఈ సినిమాను వాయిదా వేశారు. మే 9న విడుదల చేయవచ్చని ఊహాగానాలు వినబడుతున్నాయి. అయితే... ఆ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ ఇంకా రాలేదు. 



Vishwambhara Cast And Crew: చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇంకా ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా... చోటా కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.