Game Changer Release: సంక్రాంతి బరిలోనే రామ్ చరణ్ సినిమా - గేమ్ చేంజర్ విడుదలపై దిల్ రాజు ప్రకటన

Dil Raju On Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా సంక్రాంతి బరిలో విడుదల అవుతుందని 'దిల్' రాజు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.

Continues below advertisement

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా సౌత్ ఇండియన్ స్టార్ ఫిలిం మేకర్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియా ఫిలిం 'గేమ్ చేంజర్' (Game Changer). క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు‌. అయితే ఇప్పటి సినిమా సంక్రాంతికి వాయిదా పడింది. చిత్ర నిర్మాత దిల్ రాజు ఆ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించారు. 

Continues below advertisement

చిరంజీవి గారికి యూవి క్రియేషన్స్ నిర్మాతలకు థాంక్స్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ ఫాంటసి సినిమా 'విశ్వంభర' (Vishwambara) సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితం వెల్లడించారు. అయితే, మూడేళ్ల నుంచి భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటున్న తమ 'గేమ్ చేంజర్' సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని అటు డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ వర్గాలు కోరడంతో పాటు ఇటు తమ ఆలోచన కూడా అదేనని, ఆ విషయం చిరంజీవి గారికి, యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు తెలుపగా... వారు సానుకూలంగా స్పందించాలని దిల్ రాజు తెలిపారు. సంక్రాంతి విడుదల తేదీని తమకు ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. ''నిజానికి 'విశ్వంభ‌ర' పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ పనులతో స‌హా పూర్తి చేసుకుని సంక్రాంతి విడుదలకు రెడీ అవుతుంది. అయితే... నా కోసం, మా సినిమా కోసం మ‌రో విడుదల తేదీకి వాళ్లు వెళ్లినందుకు చిరంజీవి గారితో పాటు యూవీ క్రియేష‌న్స్ నిర్మాతలైన వంశీ, ప్ర‌మోద్‌, విక్కీకి నా ధ‌న్య‌వాదాలు'' అని 'దిల్' రాజు చెప్పారు.

Also Readవిశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?

Game Changer Movie Release Date: సంక్రాంతి కానుకగా జనవరి 10న 'విశ్వంభర' సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ తేదీకి 'గేమ్ చేంజర్' రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

'గేమ్ చేంజర్'ను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, 'దిల్‌' రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ సంస్థలపై 'దిల్' రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్‌. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో హీరోయిన్ గా అంజలి నటించారు.

Also Read'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?


త్వరలో 'గేమ్ చేంజర్' టీజర్ వస్తుంది!
Game Changer Teaser: ఇంకా 'గేమ్ చేంజర్' ప్రమోషన్స్ గురించి 'దిల్' రాజు మాట్లాడుతూ... ''ఆల్రెడీ రెండు పాట‌లు విడుద‌ల అయ్యాయి. ఆ రెండూ సూప‌ర్ హిట్, చార్ట్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇటీవల వచ్చిన 'రా మ‌చ్చా మ‌చ్చా...' యూట్యూబ్‌లో మార్మోగుతున్నాయి. త్వరలో టీజ‌ర్ వ‌స్తుంది. సినిమాలో ఇంకా మూడు పాటలు ఉన్నాయి. సంక్రాంతి లోపు వాటినీ విడుదల చేస్తాం. రామ్ చ‌ర‌ణ్‌ గారికి గ్లోబ‌ల్ స్టార్ అని బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అందుకు తగ్గట్టు గ్లోబ‌ల్‌గా ఈ సినిమా విజయాన్ని సాధించేలా ప్ర‌య‌త్నిస్తున్నాం. సినిమా కోసం అందరూ రేయింబవళ్లు కష్టపడుతున్నారు. సంక్రాంతికి క‌లుద్దాం'' అని అన్నారు.

Continues below advertisement