6 years later Aadhaar helps reunite missing boy : అది ముంబైలోని విక్రోలి ప్రాంతం. ఆరేళ్ల కిందట తమ పిల్లవాడు తప్పిపోయాడు లేకపోతే కిడ్నాప్ చేశారని ఓ కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసింది. ఎంత వెదికినా పోలీసులుకు క్లూ లభించలేదు. చివరికి ఆ పిల్లవాడు తన నాయనమ్మతో పాటు బయటలుదేరాడు. తనతో పాటు మనవడు వస్తున్న విషయాన్ని ఆ నాయనమ్మ గుర్తించలేదు. మధ్యలో మిస్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. అప్పటికి ఆ బాలుడికి ఎనిమిదేళ్లు. అధార్ కార్డు కూడా ఉంది. దాంతో ఎక్కడైనా ఆధార్ డేటాబేస్‌లో నమోదు అయితే సమాచారం వస్తుందని పోలీసులు చెప్పి పంపించారు. కానీ ఆ కుర్రవాడికి ఆధార్ నెంబర్ తెలియదు. ఎప్పుడైనా మళ్లీ ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నిస్తేనే తెలుస్తుంది.
ముంబైలో తప్పిపోయి ఆరేళ్ల తర్వాత కడపలో ప్రత్యక్షం
అలా తప్పిపోయిన పిల్లవాడు ఆరేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో కనిపించాడు. కడపలో ఆధార్ కేంద్రంలో ఆధార్ నమోదు చేసుకునేందుకు ఓ పధ్నాలుగేళ్ల పిల్లవాడ్ని ఓ వ్యక్తి తీసుకు వచ్చాడు. కానీ అప్పటికే అతని ఆధార్ డేటాబేస్‌లో ఉన్నట్లుగా తేలింది. ఆ అడ్రస్ మంబైలో ఉంది. ఆ కుర్రవాడితో పాటు ఉన్న వ్యక్తి కూడా ఆ పిల్లవాడి తల్లిదండ్రులను సంప్రదించాడు. దాంతో వారంతా కడప వచ్చి తమ బిడ్డను చూసి కన్నీరు పెట్టుకున్నారు. మిస్సయిన ఆరేళ్లకు మల్లీ కనిపించిన బిడ్డను హత్తుకుని తనివి తీరా ఏడ్చారు. ఆ బిడ్డ కూడా అంతే.
ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించడంతో డేటాబేస్ ద్వారా తెలిసిన ఆచూకీ
ఈ ఆరేళ్ల కాలంలో ఆ పిల్లవాడి లైఫ్ జర్నీ పూర్తిగా మారిపోయింది. ఎంతగా అంటే మొదట ముంబైలో దిక్కులు చూస్తున్న అ పిల్లవాడ్ని ఓ మహిళ గుర్తించి కర్ణాటకలోని తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ మహిళ భర్త తాగుబోతు. రోజూ వచ్చిభార్యను కొట్టేవాడు. ఆ భయంతో ఓ రోజు దగ్గరలోని రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలెక్కేశాడు. ఆ రైలు తిరుపతికి చేరింది. అక్కడ ఒంటరిగా ఉన్న పిల్లవాడ్ని గుర్తించి తెలుగు కూడా సరిగ్గా మాట్లాడకపోవడంతో సంరక్షణా కేంద్రానికి తరలించారు. కొద్ది రోజులు అక్కడ ఉన్న మరో కుర్రాడితో కలిసి పారిపోయారు. కడపకు వెళ్లి అక్కడ పని చేసుకోవడం ప్రారంభించారు. ఓ రోజు తాము పని చేస్తున్నహోటల్ నుంచి డబ్బులు తీసుకుని తోటి కుర్రాడు పరారయ్యాడు.దాంతో ఈ పిల్లగాడు ఒంటరిగా మిగిలాడు. అయితే కడపలోని ఓ వ్యక్తి చేరదీసి చిన్న చిన్న పనులు చేయించుకుంటూ పోషిస్తున్నాడు. ఓ స్కూల్ లో కూడా చేర్చాడు.
హిందీ, మరాఠీ మర్చిపోయిన పిల్లగాడు - తెలుగు మాత్రమే
అయితే అతనికి ఆధార్ కార్డు రిజిస్టర్ చేయాల్సించిన అవసరం రావడంతో అతని కుటుంబం గురించి తెలిసింది. ముంబైలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి హిందీ , మరాఠీ, ఇంగ్లిష్ వచ్చు. కానీ ఇప్పుడు తెలుగు తప్ప ఏమీ రాదు. తన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహిుతులు అందర్నీ ముంబైలో గుర్తు పట్టాడు కానీ..వారితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు. సగం సగం హిందీలో మాట్లాడుతున్నాడు. తెలుగు మాత్రం బాగా వచ్చింది.హిందీ, మరాఠీని త్వరలో నేర్చుకుంటాడని.. తమ బిడ్డ తిరిగి వచ్చినందుకు వారు పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు.