Jyothika Defends Against Negative Reviews of Kanguva : పీరియాడికల్ యాక్షన్ మూవీగా ప్రపంచవ్యాప్తంగా కంగువ నవంబర్ 14వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమాకు మొదటి రోజునుంచే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మొదటి అరగంటపై ఫ్యాన్స్ కాస్త వ్యతిరేకత చూపించినా.. తర్వాత సినిమా బాగానే ఉందనే టాక్ బయటకొచ్చింది. అయితే ఈ సినిమాపై కొందరు కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ.. జ్యోతిక సీరియస్ అయ్యారు. సూర్య భార్యగా కాదు.. సినీ ప్రేమికురాలిగా రాస్తున్నానంటూ.. సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.
జ్యోతిక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సారాంశమిదే
I pen this note as Jyotika and a cinema lover and not actor Suriya's wife అంటూ జ్యోతిక సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. "కంగువ ఓ అద్భుతమైన సినిమా. సూర్య మీరు ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాను మీ డ్రీమ్. దానిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
సినిమాల్లో అవి భాగమే..
అందరూ చెప్తున్నట్టుగానే.. సినిమాలో మొదటి అరగంట కాస్త వర్క్ అవుట్ కాలేదు. సౌండ్‌లో కూడా కాస్త సమస్యలు ఉన్నాయి. ఇలాంటి లోపాలు సినిమాల్లో ఓ భాగం. భారతీయ చిత్రాల్లో ఇది చాలా కామన్. ముఖ్యంగా సరికొత్తగా సినిమాలు చేయాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. వాటిని ప్రయోగాల్లో భాగంగానే చూడాలి. అయితే మొదటి అరగంట సినిమాని పట్టుకుని.. తర్వాతి రెండున్నర గంటల సినిమాని నెగిటివ్ చేయడం సరికాదు. " అనే అర్థం వచ్చేలా పోస్ట్‌లో రాసుకొచ్చారు.
కావాలనే నెగిటివ్ ప్రచారం
"నిజం చెప్పాలంటే కంగువ అనేది it’s an absolute cinematic experience. కెమెరా వర్క్, దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానాన్ని నేను తమిళ సినిమాల్లో ముందెప్పుడు చూడలేదు. @vetripalanisamyని ట్యాగ్ చేస్తూ.. హ్యాట్సాఫ్🫡 ఎమోజీని జత చేశారు జ్యోతిక. అయితే కొందరు మీడియాకి చెందిన వ్యక్తులు, మరికొందరు కలిసి.. కావాలనే సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ జ్యోతిక షాక్‌కి గురైనట్లు తెలిపారు.
అలాంటి రివ్యూలు తగదు
"నెగిటివ్ రివ్యూలు చూసి నేను షాక్ అయ్యాను. మీడియాకి చెందిన వారు.. మరికొందరు కంగువకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ సినిమాలో స్త్రీలను ఇబ్బంది పెట్టడం, పాత కథే చెప్పడం, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు లేవు. ఈ భారీ బడ్జెట్ సినిమా ఆ స్థాయికి దిగజారలేదు. దీనిలో టాప్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాకి అలాంటి రివ్యూలు తగదంటూ" గట్టిగా చెప్పారు.
పాజిటివ్‌గా ఏమి రాశారు మీరు..
సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్లు.. దాని గురించి పాజిటివ్‌గా రాయడం మరచిపోయారు. సినిమా రెండో భాగంలో స్త్రీల యాక్షన్ సీక్వెన్స్, పిల్లాడిపై చూపించిన ప్రేమ, కంగువకు జరిగిన ద్రోహం ఇలాంటి పాజిటివ్ విషయాలు అన్ని.. రివ్యూల్లో రాయడం మరిచిపోయారని అనుకుంటున్నానంటూ జ్యోతిక తెలిపారు.
మొదటి రోజే ఇంత నెగిటివ్ టాక్?
అలాంటి రివ్యూలను చదవాలా? వినిలా? నమ్మాలా? నాకు తెలియట్లేదు. కంగువను 3D సినిమాగా రూపొందించడానికి చిత్రబృందం పడిన కష్టానికి వారికి ప్రశంసలు రావాలి. అవి రాకపోగా.. మొదటి షో అవ్వకముందే.. కొందరు కావాలనే సినిమాపై నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా విడుదలైన మొదటి రోజే ఇంత నెగిటివ్ టాక్ని ప్రచారం చేయడం చాలా విచారించాల్సిన విషయం.
Be proud Team Kanguva, as the ones commenting negative r doing just that and nothing else to their credit to uplift cinema! అంటూ తన పోస్ట్‌ని ముగించారు జ్యోతిక. సూర్య అభిమానులు కూడా.. సూర్యలాంటి మంచి వ్యక్తిపై ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం సరికాదంటూ కామెంట్లు పెడుతూ.. పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.