ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా రూపొందుతున్న 'పుష్ప ది రూల్' (Pushpa 2 The Rule) ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఎత్తున ప్రేక్షకుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈవెంట్ హంగామా, అక్కడి సందడి ఒక రేంజ్లో ఉంది.
పాట్నాలో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే...
మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ గురూ!
నార్త్ ఇండియాలో, మరీ ముఖ్యంగా బీహార్ పరిసర ప్రాంతాల్లో 'పుష్ప: ది రైజ్' చిత్రానికి విపరీతమైన ఆదరణ లభించింది. బన్నీని అక్కడి ప్రజలు ఓన్ చేసుకొన్నారు. బీహార్ ప్రేక్షకులలో అతని స్టార్ డమ్ ఏ స్థాయిలో ఉందనేది చెప్పడానికి శనివారం రాత్రి పాసుల కోసం ఆ రాష్ట్ర యువత ఎగబడిన వీడియోలు చూస్తే చాలు.
'పుష్ప 2: ది రూల్' ట్రైలర్ విడుదల కోసం బీహార్ ప్రజలు బారులు తీరుతున్నారు. రాష్ట్ర రాజధాని పాట్నాలో సుమారు పాతిక వేల మంది సమక్షంలో... ఓపెన్ గ్రౌండ్లో భారీ ఎత్తున ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Pushpa 2 Trailer Release Time: 'పుష్ప 2 ది రూల్' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పుడు ఈ ఈవెంట్ మీద దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
'పుష్ప 2'కు ఎందుకు అంత క్రేజ్...
బన్నీకి ఎందుకు అంత ఫాలోయింగ్!
బీహార్ ప్రజల్లో 'పుష్ప 2' మీద ఎందుకు అంత క్రేజ్ నెలకొంది? బన్నీకి ఎందుకు అంత ఫాలోయింగ్? అంటే... 'మాస్! పుష్పరాజ్ మాస్!' అని చెప్పాలి. బాలీవుడ్ సినిమాల మధ్య బన్నీ చూపించిన మాస్ సినిమా వాళ్లకు అమితంగా నచ్చింది. పుష్ప క్యారెక్టర్ పిచ్చపిచ్చగా ఎక్కేసింది. సినిమాను కొత్తగా ఫీలయ్యారు. దానికి తోడు సుకుమార్ డైరెక్షన్ యాడ్ కావడంతో ఎక్కడికో వెళ్లింది.
Also Read: బికినీలో దిశా పటానీ - 'కంగువ'లో బోల్డ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన లేడీ... ఆ ఫోటోలు చూశారా?
డిసెంబర్ 5న 'పుష్ప 2' థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇందులో శ్రీవల్లి పాత్రలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా మరోసారి నటించగా... ప్రత్యేక గీతం 'కిస్సిక్'లో తెలుగమ్మాయి, యంగ్ హీరోయిన్ శ్రీ లీల స్టెప్పులు వేసింది. మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ కమెడియన్ కమ్ యాక్టర్ సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించగా... ఆయనతో పాటు తమన్ నేపథ్య సంగీతం అందించారు.