Director Siva On Kanguva Movie : హీరో సూర్య (Hero Suriya) నటించిన కంగువ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ మూవీ డైరక్టర్ శివ ఈ సినిమాను భారీ పీరియాడిక్ యాక్షన్​ ఫిల్మ్​గా తెరకెక్కించారు. నవంబర్ 14వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లు చేస్తూ.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. తాజాగా దర్శకుడు శివ.. కంగువ సినిమా గురించి.. అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన విషయాలు ఆయన తెలిపారు. 


కంగువ స్క్రిప్ట్​ను జ్ఞానవేల్​ గారే సెలక్ట్ చేశారు. సూర్యకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన కూడా చాలా ఎగ్జైట్​ అయ్యారు. అక్కడే నేను సగం సక్సెస్ సాధించాను. అయితే మూవీని చెప్పడం సులభమే. కానీ తెరకెక్కించడమే కష్టం. అలాంటిది ఈ సినిమాను ఇంత బాగా తెరకిక్కంచడంలో సూర్య, నా డైరక్షన్ టీమ్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. కంగువ సినిమా కోసం రెండున్నరేళ్లుగా వర్క్ చేశాము. ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ పర్​ఫెక్ట్​గా చేసుకున్నాము. ఈ సినిమాను త్రీడిలో చూసినప్పుడు మా కష్టం తెలుస్తుంది. 


సూర్య సపోర్ట్.. 


షూటింగ్ సమయంలో సూర్య తన పూర్తి సపోర్ట్ ఇచ్చారు. ఉదయం నాలుగు గంటలకే సూర్యగారు మేకప్​కి రెడీ అయ్యేవారు. అలా షూటింగ్​కు ప్రిపేర్ అయితే.. 7 గంటలకు ఫస్ట్ షాట్ తీసేవాళ్లం. మేకప్ సమయంలో సూర్య చాలా ఓపికగా ఉండేవారు. సినిమాను ఎక్కువ కొండల ప్రాంతంలో చేశాము. సూర్య టీమ్​తో పాటే నడుచుకుంటూ.. హిల్ క్లైంబింగ్ చేసేవారు. కంగువ సినిమాకు సూర్య ఫిట్​నెస్​ ఓ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. 50 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ చేయడం మామూలు విషయం కాదు. కానీ సూర్య డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్​గా ఉండేవారు. బాగా వర్క్​అవుట్స్ చేసేవారు. 



డ్యూయల్ రోల్.. 


కంగువలో సూర్య రెండు పాత్రల్లో కనిపిస్తారు. కంగువగా వెయ్యేళ్ల కిందటి వీరుడిగా కనిపిస్తారు. ఈ ఫ్రాన్సిస్ మోడ్రన్ క్యారెక్టర్​లో కనిపిస్తారు. ఈ రెండు క్యారెక్టర్​లో సూర్య అద్భుతమైన నటనను కనబరిచారు. బాబీడియోల్ తన స్క్రీన్ ప్రెజన్స్​తో కంగువకు కొత్త ఎనర్జీని తీసుకొచ్చారు. ఆయన కెరీర్​లో ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అవుతుంది. దిశా క్యారెక్టర్​లో కూడా అనేక షేడ్స్ ఉంటాయి. ఫ్రాన్సిస్​కి జోడిగా ఏంజిలినాగా దిశా కనిపిస్తుంది. 



అతిథి పాత్రలో అతనేనా?


కంగువలో సర్​ప్రైజింగ్ అతిథి పాత్ర ఉంటుందని.. ఇదే కంగువ సీక్వెల్​కు లీడ్ ఇస్తుందని శివ తెలిపారు. అయితే ఇప్పటికే సూర్య ఇచ్చిన హింట్స్ ప్రకారం.. ఈ క్యారెక్టర్​ను కార్తీ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్యారెక్టర్​ స్క్రీన్​పై మంచి ఇంపాక్ట్ ఇస్తుందంటూ శివ వెల్లడించారు. అయితే ఈ క్యారెక్టర్ తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎగ్జైట్ అవుతారని శివ తెలిపారు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందన్నారు. క్రియేటివ్​గా, కమర్షియల్​గా కూడా కంగువ ఆకట్టుకుంటదని ధీమా వ్యక్తం చేశారు. 



Also Read : రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన సూర్య.. కానీ బాహుబలి సినిమాకి ఇన్​స్ప్రేషన్ సూర్యేనట.. కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో రాజమౌళి స్పీచ్