Payal Rajput - National Awards: ప్రభాస్‌తో అలా... బన్నీతో ఇలా... పాయల్ అంత మాట అనేసిందేంటి?

Payal Rajput On Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాయల్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ ఛాట్‌లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేషనల్ అవార్డ్స్ మీద ఆవేదన వ్యక్తం చేశారు.

Continues below advertisement

నేషనల్ అవార్డ్స్ మీద పాయల్ రాజ్‌పుత్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ అవార్డ్స్ ఫేక్ అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఉన్నట్టుండి నేషనల్ అవార్డ్స్ గురించి పాయల్ ఎందుకు మాట్లాడారు? ఆవిడ ఏం అంటున్నారు? అనే వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

నేషనల్ అవార్డ్స్...ఈ రోజుల్లో అంతా ఫేక్!
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'ఆర్ఎక్స్ 100'తో ఢిల్లీలో పెరిగిన పంజాబీ అమ్మాయి పాయల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయం అయ్యింది. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులలో పాపులర్ అయ్యింది. సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత అర డజనకు పైగా సినిమాలు చేసినా సరే ఆమెకు సరైన విజయాలు రాలేదు. అయితే మళ్లీ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ నటించిన మంగళవారం సినిమా భారీ విజయాన్ని ఆమెకు అందించింది.

'మంగళవారం'లో పాయల్ నటనకు మంచి పేరు వచ్చింది. అయితే ఆ సినిమాకు గాను ఆవిడకు నేషనల్ అవార్డు రావాలని ఓ నెటిజన్ ఆశించాడు. సోమవారం రాత్రి నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ ఛాట్‌లో ఆ విషయం చెప్పాడు. అప్పుడు పాయల్ ''ఈ రోజుల్లో ప్రతిదీ ఫేక్. జెన్యూన్ టాలెంట్ (నిజంగా ప్రతిభావంతులను) అప్రిషియేట్ చేయడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు టాలెంట్ గుర్తిస్తారని ఆశతో ఉన్నాను'' తెలిపారు. ఇప్పుడు తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు? అనే ప్రశ్నకు సైతం ఆవిడ సమాధానం ఇచ్చారు. ఏదో ఒక సినిమా చేయాలని తాను అనుకోవడం లేదని, తనకు సూట్ అయ్యే మంచి కథలు కోసం ఎదురు చూస్తున్నానని, అటువంటివి రాని సమయములో ఇంట్లో కూర్చుంటానని చెప్పారు.

Also Readడ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల తక్కువేం తీసుకోలేదు - అల్లు అర్జున్ 'పుష్ప 2'లో ఐటెం సాంగ్ కోసం ఎంతో రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?


ప్రభాస్‌తో అలా... బన్నీతో ఇలా!
'కల్కి 2898 ఏడీ' విడుదలకు ముందు బుజ్జి కారు పరిచయం చేయడానికి ప్రభాస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అదే సమయంలో పాయల్ చేసిన మరొక పోస్ట్ వల్ల ప్రభాస్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కొంతమంది అయితే మరో అడుగు ముందుకు వేసి ప్రభాస్, పాయల్ ప్రేమలో ఉన్నారని అర్థం లేని కథనాలు రాశారు. 

ప్రభాస్ గురించి పాయం ఏమనుకుంటున్నారు? ఆయనతో నటించే అవకాశం వస్తే? ఇలాంటి వివరాల్లోకి వెళితే... ప్రభాస్ జోడిగా ఆవిడని చూడాలని ఆశపడుతున్నట్లు ఒక నెటిజన్ పేర్కొనగా... ''నేను సినిమా నేపథ్యం నుంచి రాలేదు. బాగా డబ్బున్న అమ్మాయిని కూడా కాదు. నాకు సినిమాల్లో అవకాశాలు రావడం చాలా కష్టం‌. ఇప్పటికీ సినిమా ఛాన్స్ ల కోసం స్ట్రగుల్ అవుతున్నా. నాకు ప్రభాస్ తో పని చేయాలని ఉంది. ఈ ఇండస్ట్రీ చాలా కఠినమైనది'' అని చెప్పారు.

ఒకవేళ అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వస్తే? ఎటువంటి క్యారెక్టర్ చేయాలని అనుకుంటారు? బబ్లీ రోల్ చేస్తారా? రొమాంటిక్ రోల్ చేస్తారా? అని అడిగితే... ''బన్నీతో బబ్లీ బబ్లీ రోల్ చేయాలని ఉంద''ని ఆవిడ చెప్పారు.

Also Readఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా

Continues below advertisement