బాహుబలికి సూర్యనే నా ఇన్స్ప్రేషన్
పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టానని అందరూ అంటున్నారు. కానీ మీ అందరకీ ఫ్రాంక్‌గా చెప్పాల్సిన విషయమొకటి ఉంది. తెలుగు సినిమాని ఇక్కడితోనే ఉంచకుండా.. దానిని బయటకు తీసుకెళ్లడానికి.. ఒన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్ప్రేషన్ ఫర్ మీ ఈజ్ సూర్య అంటూ రాజమౌళి చెప్పారు. చాలా సంవత్సరాలు, చాలాసార్లు.. గజినీ సమయంలో సూర్య ఇక్కడికి వచ్చి.. ఇక్కడ ప్రమోట్ చేశారు.
ఆ ప్రమోషన్స్ సమయంలో సూర్య తెలుగు వారికి ఎలా దగ్గరయ్యాడనేది నాకో కేస్ స్టడీలాగా మారిపోయింది. ఇదే విషయాన్ని నేను ఎందరో హీరోలకు, దర్శకులకు చెప్పేవాడినంటూ తెలిపారు. కేవలం సినిమాను ప్రమోట్ చేయడం మాత్రమే కాకుండా.. తెలుగు ప్రజల ప్రేమను తాను ఎలా పొందాడో.. మనం కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రజల ప్రేమను అలా పొందాలని చెప్తూ ఉండేవాడిని. సో సూర్య యూ ఆర్ మై ఇన్స్ప్రేషన్ ఫర్ పాన్ ఇండియా ఫిల్మ్ బాహుబలి. అంటూ చెప్పేశారు.
ఓ సినిమా చేయాల్సింది.. కానీ..
మేము కలిసి సినిమా చేద్దామనుకున్నాము కానీ కుదర్లేదు. ఓ ఫంక్షన్లో సూర్య చెప్పాడు.. రాజమౌళితో సినిమా చేసే అవకాశాన్ని మిస్ అయ్యానని.. కానీ కాదు.. సూర్యతో సినిమాని చేయడం నేను మిస్ అయ్యాను. I Love Him So Much. Love His Acting So Much. Love His On Screen Pressence So Much అంటూ సూర్యపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు రాజమౌళి. సూర్య మీరు ఆ సమయంలో నా సినిమాను వదులుకున్న నిర్ణయాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఆ సమయంలో మీరు నా సినిమా కాకుండా చేసిన వేరే సినిమా చేయడమే సరైన నిర్ణయమని మీరు ప్రూవ్ చేశారంటూ రాజమౌళి తెలిపారు.
సూర్య రియాక్షన్ ఇదే..
ఫ్యామిలీలో పెద్ద అన్న కరెక్ట్‌గా చేస్తే.. అది తర్వాత జనరేషన్స్‌కి ఇన్స్ప్రేషన్ ఉంటుంది. అతనిని ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. సినిమా ఫ్యామిలీలో మీరు పెద్ద అన్నలాగ. మిమ్మల్ని చూసే మేము ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాము. పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్తున్నాము. కానీ మాకు ఆ దారి వేసింది మాత్రం మీరే. నేను సిగ్గులేకుండా చెప్తున్నాను. నేను ఆ రోజు ట్రైన్‌ని (సినిమాని)మిస్ అయ్యాను. నేను ఇంకా ప్లాట్‌ఫారమ్ మీదే ఉన్నాను. నేను విష్ చేస్తున్నాను.. ఏదొ సమయంలో ఆ ట్రైన్ (రాజమౌళి సినిమా) నా దగ్గరికి వస్తుందని వెయిట్ చేస్తున్నానంటూ సూర్య కూడా తన మనసులో మాట రాజమౌళికి చెప్పేశారు.
Also Read : తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!