బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్న వీడియో వైరల్ అవుతోంది. బుధవారం కరీనా కటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరింది. భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జహంగీర్‌తో కలిసి ఆమె ముంబై ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. సైఫ్, తైమూర్ అలీ ఖాన్ బాగానే లోపలకు వెళ్లిపోయారు. కానీ కరీనాను, ఆమె సిబ్బందిని మాత్రం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కేర్ టేకర్ ను పాస్ పోర్ట్ అడిగారు. కరీనాను సైతం పాస్ పోర్ట్ అడిగిన తర్వాతే లోనికి అనుమతించారు. ఈ వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది.
కరీనా మేనేజర్ లు పాస్ పోర్టు ఇవ్వడంతో సిబ్బంది చెక్ చేశారు. అప్పటికే ఎయిర్ పోర్టులోకి వెళ్లిన సైఫ్ అలీఖాన్ వెనక్కి తిరిగొచ్చి కరీనా కోసం ఎదురు చూస్తు నిలబడ్డారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.
Also read: సత్యభామగా రమ్యకృష్ణ.. ‘బంగార్రాజు’ పోస్టర్ అదుర్స్!
నెలరోజుల క్రితం సల్మాన్ ఖాన్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ‘టైగర్ 3’ సినిమా షూటింగ్ కోసం రష్యా వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి వెళ్లిన సల్మాన్ సెక్యూరిటీ చెక్ పట్టించుకోకుండా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఎంట్రన్స్ వద్ద ఉన్న ఉన్న యువ సీఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకుని తొలుత సెక్యూరిటీ చెక్ పూర్తిచేయాలని కోరారు. అదే సమయంలో సల్మాన్ ఫొటోలను తీస్తున్న ఫొటోగ్రాఫర్లను వెనక్కి వెళ్లాల్సిందిగా కోరడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: తిరుమల నూతన పాలకమండలి సభ్యులు వీరే..ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50 కి పెంచిన ప్రభుత్వం
Also Read: స్వల్పంగా పెరిగిన బంగారం వెండిధరలు,ప్రధాన నగరాల్లో ధరలెలా ఉన్నాయంటే..