తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. గత పాలకమండలిలో 8 మందిగా ఉన్న ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను ఈ సారి ఏకంగా 50 కి పెంచింది. అయితే వీరికి ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉండవు. బోర్డులో మాత్రం గతంలోలాగే మొత్తం 25 మందినే కొనసాగనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ మేరకు పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. గత పాలకమండలిలో సభ్యులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు శ్రీనివాసన్‌, జూపల్లి రామేశ్వరరావు, పార్థసారథి రెడ్డిలను కొనసాగించారు. అలాగే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తెలంగాణ నుంచి మురంశెట్టి రాములు, లక్ష్మీనారాయణకు వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. ఈసారి పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు కొత్తగా అవకాశం కల్పించారు. గత బోర్డులో సభ్యులుగా పనిచేసిన ముగ్గురు ఎమ్మెల్యేల స్థానంలో ఇప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌లకు చోటు కల్పించారు.


తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 24 మంది సభ్యులు వీరే: పోకల అశోక్‌, మల్లాడి కృష్ణారావు, టంగుటూరు మారుతిప్రసాద్‌, మన్నే జీవన్‌ రెడ్డి, డాక్టర్‌ బండి పార్థసారథి రెడ్డి, డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు, ఎన్‌.శ్రీనివాసన్‌, రాజేష్‌ శర్మ, బి.సౌరభ్‌, మూరంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే), ఏపీ నందకుమార్‌, పచ్చిపాల సనత్‌కుమార్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌, బూదాటి లక్ష్మీనారాయణ, మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌, ఎంఎన్‌ శశిధర్‌, అల్లూరి మల్లేశ్వరి, డాక్టర్‌ ఎస్‌.శంకర్‌, ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డి(ఎమ్మెల్యే), బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (ఎమ్మెల్యే, కనిగిరి), కిలివేటి సంజీవయ్య (ఎమ్మెల్యే, సూళ్లూరుపేట), కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (ఎమ్మెల్యే, పాణ్యం)


Also Read: స్వల్పంగా పెరిగిన బంగారం వెండిధరలు,ప్రధాన నగరాల్లో ధరలెలా ఉన్నాయంటే..
ఇక ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కూడా ప్రభుత్వ నిర్ణయమేనన్నారు టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి.  వీరికి కూడా బోర్డు సభ్యులతో సమానంగా దర్శన అవకాశం ఉంటుంది కానీ బోర్డు సమావేశాలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. టీటీడీ పాలకమండలి పదవీకాలంతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల పదవీకాలం ముగుస్తుందన్నారు.


ప్రత్యేక ఆహ్వానితులు: కుందవరపు శ్రీనివాస్‌ నాయుడు, రాచుపల్లి వెంకట సుబ్బారెడ్డి, బద్వేలు సుబ్బారెడ్డి, కావేరి భాస్కరరావు, డా.సంపత్‌ రవినారాయణన్‌, మురళి మహేశ్వరరాజు, రమేష్‌ శెట్టి, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, యెలిశాల రవిప్రసాద్‌, బీరేంద్రవర్మ, మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి, దుష్మంత్‌కుమార్‌ దాస్‌, అమోల్‌ కాలే, రాధాకృష్ణ ఆడిగ, ఆర్‌.గోవిందహరి. నరేష్‌కుమార్‌ , అగర్వాల్‌ , ప్రసాద్‌వర్మ, సాముల రామ్‌రెడ్డి, డా.బాలకృష్ణ రాజా ,సిద్దార్థ లాడే, గోవిందరాజులు, డా.ఎన్‌.కన్నయ్య, జీఆర్‌ కృష్ణ, ఆతుకూరి ఆంజనేయులు. మంజునాథ్‌, డా.టి.ఎ.శ్రవణ్, జి.రామచంద్రమూర్తి, దాట్ల రంగవతి , దాసరి కిరణ్‌,కుమార్‌, కోమటిరెడ్డి లక్ష్మి,శంభుప్రసాద్‌ మహంత్‌, ముక్కా రూపానందరెడ్డి, కుమారగురు, తాడిశెట్టి మురళి, పైడా కృష్ణప్రసాద్‌, కుపేందర్‌రెడ్డి, దాసరి వెంకటరామకృష్ణ ప్రసాద్‌, పోతిరెడ్డి నాగార్జునరెడ్డి, చింతకుంట సత్యనారాయణ, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కొలిశెట్టి శివకుమార్‌, డి.జనార్దన్‌రెడ్డి, కట్టా సింగయ్య, విజయ్‌కుమార్‌ గురూజీ, కె.ఎం.శివశంకరాచారి, నాదెండ్ల సుబ్బారావు, ఆర్‌.గుర్నాథ్‌రెడ్డి, దాసెట్టి సుబ్రహ్మణ్యం, దాసరి మురళీకృష్ణ, అవినాష్‌గౌడ్‌.


ఓవరాల్ గా చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా 75 మందితో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది.


Also Read: ఈ రాశులవారికి పని ఒత్తిడి తగ్గుతుంది, వారిని మాత్రం కొన్ని ఊహించని సంఘటనలు ఇబ్బందిపెడతాయి.. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...


Also Read: బాలిక హత్యాచార కేసులో అతను దొరికేశాడు, త్వరలో నిందితుడు కూడా..! రంగంలోకి డీజీపీ


Also Read: తెలుగు రాష్ట్రాల్లో నేడు పలు చోట్ల వర్షాలు.. ఏపీలో ఐదు రోజుల వరకు..