కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ 'దొంగలున్నారు జాగ్రత్త..' ఆ తరువాత 'సాగరా సోదరా..' అనే రెండు టాస్క్ లు ఇచ్చారు. ఇవి ఫిజికల్ టాస్క్ లు కావడంతో.. హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయి ఆడేశారు. ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఈ రెండు టాస్క్ లను కంటిన్యూ చేశారు.
'సాగరా సోదరా..' టాస్క్ కోసం రెండు టీమ్స్ కి సంచాలకులుగా శ్రీరామచంద్ర, మానస్ వ్యవహరించారు. అయితే టాస్క్ పూర్తయిన తరువాత వీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం బిగ్ బాస్ కి చెప్పాలి. కానీ ఇద్దరూ ఏకాభిప్రాయంతో లేకపోవడంతో.. నిర్ణయం తీసుకోలేకపోయారు. అలా చేయకపోతే టాస్క్ క్యాన్సిల్ చేస్తానని బిగ్ బాస్ చెప్పినా.. హౌస్ మేట్స్ లెక్కచేయలేదు. దీంతో 'సాగరా సోదరా' టాస్క్ ను క్యాన్సిల్ చేశారు బిగ్ బాస్.
టాస్క్ క్యాన్సిల్ అవ్వడంతో 'Team Eagle' గంతులేసింది. దీంతో Team Wolf సభ్యుడు రవి 'ఒక టాస్క్ రద్దవ్వడం మన ఫెయిల్యూర్.. సిగ్గుపడాలి బ్రో' అని శ్రీరామచంద్రతో అనగా.. మేమెందుకు సిగ్గుపడాలి.. మేం తలెత్తుకొనే ఉంటామని శ్రీరామచంద్ర, ప్రియా అన్నారు.
'ఆడపిల్లను ఏడిపించి ఆడతావా'..
అనంతరం 'దొంగలున్నారు జాగ్రత్త' టాస్క్ ను కంటిన్యూ చేశారు. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ అంతా చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేశారు. Team Wolf సభ్యులు Team Eagle దగ్గర ఉన్న బ్యాటెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు హౌస్ మేట్స్ కారణంగా సిరికి దెబ్బలు తగిలాయి. దీంతో ఆమె గట్టిగా గట్టిగా అరుస్తూ ఏడ్చింది. 'ఆడపిల్లను ఏడిపించి ఆడతావా' అంటూ.. రవిపై మండిపడ్డాడు శ్రీరామచంద్ర. ఆ తరువాత సిరి.. శ్వేతాను రెచ్చగొడుతూ కామెంట్ చేయడంతో ఆమె సిరి పైకి దూసుకెళ్లింది. అది చూసిన యానీ మాస్టర్ 'శ్వేతా నువ్ వెరీ వెరీ వైల్డ్' అని కామెంట్ చేసింది.. 'సాయంత్రం అయ్యేసరికి దెయ్యం పూనుతాది' అంటూ ప్రియా కూడా సెటైర్ వేసింది.
నేను డబ్బుకోసం రాలేదు : శ్రీరామచంద్ర
కెప్టెన్ గా శ్రీరామచంద్ర టీమ్ ను డీల్ చేసే విధానం బాగాలేదని రవి అతడికి చెప్పే ప్రయత్నం చేశాడు. నువ్ సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఆడు' అని శ్రీరామ్.. రవితో చెబుతుండగా దానికి రవి.. 'ఇది నా గేమ్ బ్రో నా ఇష్టం' అని చెప్పాడు. దానికి శ్రీరామ్ 'నీ గేమ్ నువ్ ఆడు కానీ నాతో మైండ్ గేమ్స్ ఆడొద్దు' అని రవితో చెప్పాడు శ్రీరామ్. అలానే ''నేను ఇక్కడకి డబ్బు కోసం, టైటిల్ కోసం రాలేదు.. హృదయాలు గెలుచుకోవడానికి వచ్చా.. లేకపోతే నాకు అవసరమే లేదు.. యాభై లక్షలిచ్చి వెళ్లమంటే నేను మొహాన్న కొట్టి వెళ్తా.. రిలేషన్ షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి వచ్చా.. నాతో లాంగ్ రిలేషన్ షిప్ కావాలని అన్నావ్.. కానీ నాకు ఈరోజు నీ బిహేవియర్ నచ్చలేదు'' అంటూ శ్రీరామచంద్ర చెప్పుకొచ్చాడు.
సారీ చెప్పిన శ్వేతా..
నామినేషన్ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యానని.. ఫ్లోలో కొన్ని మాటలు అనేశానని లోబోకి సారీ చెప్పింది శ్వేతా. 'నేను నీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను.. నీకోసం కేరింగ్ తీసుకోకుండా ఉండలేను. నేను చాలా ఎమోషనల్ పర్సన్ ని' అని లోబోతో చెప్పుకొచ్చింది. అనంతరం హెల్త్ ఇష్యూస్ కారణంగా గేమ్ ఆడలేకపోయానని.. శ్రీరామ్ కి సారీ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు లోబో. తనకు ఏదైనా అయితే ఫ్యామిలీని చూసేవాళ్లు లేరని.. ఈరోజు గేమ్ కోసం చూసుకుంటే రేపటి రోజున ఏదైనా అయితే.. అంటూ తన ఫ్యామిలీను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశాడు.
'ఆ గట్టునుంటావా..? ఈ గట్టునుంటావా..?'..
బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి మరో గేమ్ ఇచ్చాడు. అదేంటంటే.. 'ఆ గట్టునుంటావా..? ఈ గట్టునుంటావా..?'. ఈ టాస్క్ లో Team Eagle విజేతలుగా నిలిచారు.
ఆ తరువాత 'దొంగలున్నారు జాగ్రత్త' టాస్క్ ను కంటిన్యూ చేశారు. గేమ్ మధ్యలో శ్రీరామచంద్ర, సన్నీ ఇద్దరూ 'పగిలిపోద్ది..' అని తిట్టుకుంటూ ఒకరినొకరు కొట్టుకునేలా మీదమీదకు వెళ్లారు. హౌస్ మేట్స్ వాళ్లను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
ఆ తరువాత రంగంలోకి దిగిన బిగ్ బాస్.. ఇంట్లో ఎటువంటి హింసకు తావులేదని ఇంటి సభ్యులను హెచ్చరించారు. తక్షణమే ఇంట్లో హింసను ఆపండని చెప్పారు. అయినా హౌస్ మేట్స్ తగ్గలేదు.
'ఒసేయ్ ఉమా.. సిగ్గులేదా నీకు.. తూ..' :
'ఉమా కొట్టింది' అంటూ సిరి గట్టిగా అరిచింది. 'ఎందుకు కొట్టారు' అంటూ ఉమాదేవి మండిపడింది. ఇంతలో యానీ మాస్టర్.. 'ఒసేయ్ ఉమా.. చింపుతావా.. సిగ్గులేదా నీకు.. తూ అంటూ' డైలాగ్ వేసింది. దానికి ఉమా.. 'మీరు కొడితే నేను చింపుతా' అంటూ అరుస్తూ చెప్పింది. దానికి యానీ.. 'చిల్లర్' అంటూ ఉమాను ఉద్దేశిస్తూ అంది. 'అవును నేను చిల్లరే.. నువ్ పెద్ద క్లాస్ నుంచి వచ్చావ్ మరి' అంటూ ఫైర్ అయింది.
ఇక ఈ 'దొంగలున్నారు జాగ్రత్త' టాస్క్ లో Team Wolf విజేతలుగా నిలిచారు. మొత్తం కెప్టెన్సీ టాస్క్ లో రెండు టీమ్స్ సమానంగా ఉండడంతో వారికి ఐదేసి చొప్పున ఫ్లాగ్స్ ను పంపించారు బిగ్ బాస్.
ఇక రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయింది టీమ్. స్విమ్మింగ్ పూల్ దగ్గర శ్రీరామచంద్ర.. హమీదకు మసాజ్ చేస్తూ కనిపించాడు. 'నీ దగ్గర ఉండాలనిపిస్తాది.. దూరంగా కూడా ఉండాలనిపిస్తాది' అని హమీద అనగా.. 'ఇంకొకరు గుర్తొస్తే ఉండకూడదు ఎవరి దగ్గర' అంటూ కౌంటర్ ఇచ్చాడు శ్రీరామచంద్ర.