హైదరాబాద్‌లోని సైఫాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితుడు రాజు కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. ఇప్పటికే అతణ్ని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయితే, నిందితుడిని పట్టుకొనే దిశగా పోలీసులు కాస్త పురోగతి సాధించారు.
నిందితుడు రాజు కోసం గాలిస్తుండగా అతడి స్నేహితుడిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా రాజు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే, రాజుకు తోడుగా ఎల్బీనగర్ వరకు అతడి స్నేహితుడు కూడా వచ్చినట్లుగా పోలీసులకు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అందులో అతడు కూడా కనిపించాడు. ఆ తర్వాత ఎల్బీ నగర్ నుంచి రాజు ఒంటరిగా వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న రాజు స్నేహితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజు ఎక్కడికి వెళ్లాడని అతని ద్వారా ఆరా తీస్తున్నారు. రాజును ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో విచారణ చేపట్టి స్నేహితుడి నుంచి రాజు ఆచూకీ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుడు చిక్కడంతో రాజు కూడా ఇక దొరికిపోతాడని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసంతృప్తి! కనీసం కారు కూడా దిగలేక.. చివరికి..
అయితే, పారిపోయే ముందు రాజు ఎల్బీ నగర్‌లో ఆటో దొంగతనానికి యత్నించినట్లుగా కూడా పోలీసులు కనుగొన్నారు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో ఆ దొంగతనం విఫలమైందని పోలీసులు చెప్పారు. అక్కడి నుంచి నాగోల్ వరకు బస్సులో వెళ్లి.. నాగోల్‌లోని ఓ మద్యం దుకాణం వద్ద లిక్కర్ కొనుగోలు చేసి సేవించాడు. అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు.
డీజీపీ టెలీకాన్ఫరెన్స్
ఈ కేసులో నిందితుడిని డీజీపీ మహేందర్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. బుధవారం ఆయన అన్ని జిల్లాల ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. నిందితుడి ఫోటోతో గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాల వద్ద నిందితుడి కోసం గాలించాలని సూచించారు.
Also Read: Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..
Also Read: TS High Court: మీకు నిర్లక్ష్యమా? మేమే జోక్యం చేసుకుంటాం.. సర్కార్‌పై హైకోర్టు సీరియస్