తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ బాలిక అత్యాచార, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత దారుణంగా హత్య చేసిన తప్పించుకు తిరిగిన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచార, హత్య ఘటనలో  నిందితుడైన రాజు మృతదేహంగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. తెలంగాణ డీజీపీ మహేంద్ర రెడ్డి ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా ధ్రువీకరించారు.  




కేటీఆర్ ట్వీట్ 


సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. డీజీపీ మహేంద్రరెడ్డి ఈ విషయాన్ని నిర్థారణ చేశారని ఆయన తెలిపారు. 






 


డీజీపీ ధ్రువీకరణ 


నిందితుడు రాజు చేతిపై మౌనిక అనే టాటూ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఫొటోలను డీజీపీ తెలంగాణ పోలీసు ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 






పోలీసుల తనిఖీలు


అంతకు ముందు సైదాబాద్ బాలిక అత్యాచార నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు చేపట్టారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద మఫ్టీలో నిఘా పెట్టారు. చివరగా ఉప్పల్‌లో రాజు కనిపించినట్లు తెలుస్తోంది.  నిందితుడిని త్వరగా పట్టుకోవాలని హోంమంత్రి, డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.  ఆంధ్రా-తెలంగాణ బోర్డర్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 


ప్రత్యక్ష సాక్షులు


నిందితుడు రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులైన ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను అందించారు. వాళ్లద్దరూ ఉదయాన్నే డ్యూటీకి వచ్చామని, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని చెప్పారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత వారు ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని, ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు ఎదురుగా వెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అనంతరం దగ్గరకు వెళ్లి పరిశీలించగా సైదాబాద్ నిందితుడు రాజు అనే అనుమానం తమకు వచ్చిందన్నారు. ఆ తర్వాత 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మరోవైపు రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తున్నారు.


Also Read: Saidabad Girl Case: సైదాబాద్ చిన్నారి కుటుంబానికి మంత్రుల పరామర్శ...రూ. 20 లక్షల పరిహారాన్ని తిరస్కరించిన బాధిత కుటుంబం... వైఎస్ షర్మిల దీక్ష భగ్నం


Also Read: Telangana Nirbhaya : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?