Vantalakka and Maguva o Maguva Team in Biggboss house: బిగ్ బాస్ ఇంట్లో చివరి వారం ఎంత జాలీగా జరుగుతోందో అందరికీ తెలిసిందే. టాప్ 5 కంటెస్టెంట్లు రాజభోగాలు అనుభవిస్తున్నారు.ఇక పనిలో పనిగా అన్నట్టుగా స్టార్ మా సీరియల్స్‌ను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. సీరియల్ టీంను బిగ్ బాస్ ఇంట్లోకి రప్పించి ఏవో చిన్న చిన్న టాస్కులు పెట్టి ఆడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాటి ఎపిసోడ్‌లో ఏ సీరియల్ టీంలు వచ్చాయో చూద్దాం.
అవినాష్, నబిల్ కలిసి చేసిన బజ్జీలు, పకోడీలను బిగ్ బాస్‌కు ఇచ్చారు. కొంచెం ఇస్తారా? ఇంకా ఇవ్వలేరా? అని అలా పదే పదే ఇప్పించుకున్నాడు. వారు కూడా ఓపిగ్గా బజ్జీలు చేసి పంపించారు. మధ్యలో అవినాష్, నబిల్‌లను పిసినారి అని అంటాడు బిగ్ బాస్. మేం పిసినారా? నువ్వే రేషన్ పంపించడం లేదు కదా బిగ్ బాస్.. సరే నీకు ఇంకా బజ్జీలు కావాలంటే కెమెరాను ఊపు అని అంటారు. దీంతో ఆపరేటర్లు కెమెరాలను ఊపుతారు. మాకు పెరుగు పంపు అంటూ అవినాష్ అడిగితో నో అన్నట్టుగా కెమెరాలను ఊపుతారు. అలా కాసేపు వారితో ఆడుకున్నారు.
ఆ తరువాత వంటలక్క టీం వచ్చింది. వైష్ణవి, కృష్ణ వచ్చి కంటెస్టెంట్లతో కాసేపు సరదాగా ముచ్చట్లు పెడతాడు. రూ. 10928 కోసం బిగ్ బాస్ పెట్టిన టాస్కులో బీబీ పరివారమే గెలుస్తుంది. ఆ తరువాత కంటెస్టెంట్లకు పిజ్జాలు, బర్గర్లు పంపుతాడు బిగ్ బాస్. తన కోసం ఓపిగ్గా బజ్జీలు చేసినందుకు ఖుషీ అయిన బిగ్ బాస్ అలా బర్గర్లు, పిజ్జాలు పంపించాడు. ఆ తరువాత మగువా ఓ మగువా టీం వచ్చింది. చంటి, సింధూరలు వచ్చి తమ సీరియల్ థీమ్ చెప్పారు. ఆ తరువాత కంటెస్టెంట్లతో కాసేపు ఆటపాటలతో అల్లరి చేశారు.
ఈ క్రమంలో అవినాష్ తన స్కూల్లో చేసిన కొంటె పనుల గురించి చెప్పాడు. స్కూల్లో ఎగ్జామ్స్‌లో ఎలా మోసం చేసేవాడో వివరించాడు. ఖాళీ షీట్లు పెట్టడం.. ఆ తరువాత వాటిల్లో ఆన్సర్స్ నింపడం వంటివి చేసేవాడని చెప్పుకొచ్చాడు. ప్రేరణకు చిన్నతనంలో తలకు దెబ్బ తాకిందట. ఆ విషయం చెప్పడంతో అవినాష్ నవ్వేస్తాడు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావా? అంటూ కామెడీ చేశాడు. ఆ తరువాత రూ. 10010 కోసం పెట్టిన టాస్కుల్లో చంటి, సింధూరతో కలిసి ప్రేరణ, గౌతమ్ ఆడతారు. ఆ ఆటలో మా పరివారాన్ని, బీబీ పరివారం ఓడిస్తుంది. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో ఎవరు వస్తారో చూడాలి.