Bigg Boss 8 Telugu Episode 101 Day 100 written Review: బిగ్ బాస్ ఇంట్లో చివరి వారం ఎంత బోరింగ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే గత సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు అంటూ రెండు, మూడు రోజులు లాగేవాడు. ఈ సారి కాస్త స్టార్ మా పరివారం, బీబీ పరివారం అంటూ టాస్కులు పెట్టి ఇంకా ప్రైజ్ మనీని పెంచే, తగ్గించే టాస్కులు పెడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బ్రహ్మముడి కావ్య, మామగారు టీం వచ్చింది. ఇక ఈ ఎపిసోడ్ ఎలా సాగిందంటే..


బ్రహ్మముడి కావ్య (Brahmamudi Kavya Deepika Rangaraju) ఎంట్రీ ఇంట్లో కాస్త సందడి వాతావరణం నెలకొంది. అసలే ఈ కావ్య బయట షోల్లోనూ తెగ అల్లరి చేస్తుంటుంది. ఆమె కాస్త తింగరి బుచ్చి టైపు. తనను బిగ్ బాస్ రూంకి పిలిచాడంటూ ఎగిరి గంతేసింది. అలా అనొద్దు.. అది బూతు.. కన్ ఫెషన్ రూంకి పిలిచాడు అని చెప్పాలంటూ అవినాష్ కరెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఏమైనా సీక్రెట్లు చెప్పండి అని కావ్యని బిగ్ బాస్ అడిగితే.. నన్ను నెక్ట్స్ సీజన్‌కి పిలుస్తానంటేనే చెబుతా అని కావ్య కాస్త అల్లరి చేసింది.


Also Read: బిగ్ బాస్ ఫినాలే... గౌతమ్ విన్నర్ అవుతాడా? రన్నరా? 'బిగ్ బాస్ 8' హౌస్‌లోని అతని గేమ్‌లో ప్లస్, మైనస్‌ లేంటి?


బిగ్ బాస్ తనకు ముద్దు పెట్టాడంటూ బయటకు వచ్చి కావ్య తెగ సిగ్గు పడిపోయింది. కానీ బిగ్ బాస్ అనేవారు కనిపించడు.. అన్న సంగతి తెలిసిందే. ఏంటి ఇప్పుడు ఇది నమ్మాలా? అంటూ కంటెస్టెంట్లు కావ్య గాలిని తీసేశారు. ఆ తరువాత 11472 కోసం పెట్టిన టాస్కులో అవినాష్, కావ్య పోటీ పడ్డారు. అందులో అవినాష్ గెలిచాడు. కావ్య వెళ్లిన తరువాత 'మామ గారు' సీరియల్ టీం (Mamagaru Serial) వచ్చింది.


'మామ గారు' సీరియల్ నుంచి గంగా, గంగాధర్ వచ్చారు. వారితో కంటెస్టెంట్లు కాసేపు ముచ్చటించారు. గౌతమ్ తన లవ్ స్టోరీని చెప్పాడు. నిఖిల్ తన స్టోరీని చెప్పాడు. బ్రేకప్ అనే దానికి సరైన కారణాలు ఉండాలని అన్నాడు. అయితే ఇది పర్సనల్‌గా చెబుతున్నావా? జనరల్‌గా చెబుతున్నావా? అని మామగారు టీం అడుగుతుంది. పర్సనల్‌గానే అందరికీ చెబుతున్నా అని నిఖిల్ కవర్ చేస్తాడు. ఆ తరువాత 9987 కోసం పెట్టిన టాస్కులో బీబీ టీం విన్ అయింది. మరి ఇక బుధవారం నాటి ఎపిసోడ్‌లో ఎవరు వస్తారో చూడాలి. ఈ టాప్ 5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు, వారికి ఇచ్చే ఎలివేషన్లు ఎలా ఉంటాయో వారి వారి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు అయితే నిఖిల్, గౌతమ్‌లకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయని సమాచారం. విన్నర్, రన్నర్ ఈ ఇద్దరిలోనే ఉన్నారని టాక్స్ వినిపిస్తున్నాయి.


Also Read: బిగ్ బాస్ ఫినాలే... ప్రేరణ ఆటలో ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి? బిస్‌బాస్‌ 8 విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా?