బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ఏకైక లేడీ ప్రేరణ కంభం. 'టాప్ 5 కంటెస్టెంట్లలో మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ప్రేరణ' అని నాగార్జున చెప్పారు. ఒక్క క్షణం సంతోషించినా... తర్వాత ఆమె కూడా షాక్ అయ్యింది. టాప్ 5లో ఆవిడ ఒక్కరే కదా మరి! అయితే... టాప్ 4తో సరిపెట్టుకుంది ప్రేరణ. ఎందుకు ఫినాలేలో టాప్ 2లోకి వెళ్లలేకపోయింది? ఏమైంది? అనేది చూస్తే...

ప్రేరణ ఆట లోని ప్లస్ లు ఇవేముందుగా ప్రేరణ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే... సీజన్ మొదటి నుంచి ఆమె మొదటి నుండీ ఆమె మేల్ కంటెస్టెంట్లతో సమానంగా పోటీపడుతూ టాస్కులు ఆడింది. నిఖిల్, యశ్మీ,పృథ్విలతో కలిసుంటూ కూడా తన ఇండివిడ్యువాలిటీని చాలా వరకు నిలబెట్టుకుంది. ముఖ్యంగా కౌబాయ్ నామినేషన్ టాస్క్ లో తను ఆడిన తీరు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక పక్క గట్టిగా ఆడుతూనే మరోపక్క కిచెన్ డ్యూటీ చాలా వరకు తనే చేసేది. మధ్యలో ఎమోషన్ పరంగా కాస్త డౌన్ అయినా చివరికి వచ్చేసరికి మళ్ళీ ఆటలో ఫైర్ చూపించింది. నామినేషన్స్ లో ఆర్గుమెంట్స్ పక్కగా చేసేది. మొదటి నుంచి నామినేషన్స్ లోకి వస్తూ ఉండటం వల్ల తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. అలాగే 'కృష్ణా ముకుందా మురారి' సీరియల్ ద్వారా ప్రేరణకు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

Also Read: 'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే

ప్రేరణ ఎందుకు విన్నర్ కాలేదు... మైనస్‌లు ఏంటి? ప్రేరణకు ఉన్న అతిపెద్ద లోపం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం. ముఖ్యంగా ఆ మాట విసురు ఆమెకు చాలా విమర్శలు తెచ్చిపెట్టింది. సీజన్ మధ్యలో వచ్చిన గెస్ట్ ల దగ్గర నుండి చివరకు ఆమె భర్త  శ్రీ పాద్ కూడా ఇది అంశంపై ఆమెను హెచ్చరించారు. దానితో ఆమె కూడా చివర్లో తన ఆటను, మాటను మార్చుకుంది. ఇక గౌతమ్ కృష్ణపై ఆమె అకారణ ద్వేషాన్ని పెంచుకుందనే అభిప్రాయం గౌతమ్ ఫ్యాన్స్ లో ఉంది. కావాలనే గౌతమ్ ను నామినేట్ చేయడం... అతనిపై మాటలు విసరడం ఆమె ఆటకు మైనస్ అనే చెప్పాలి. చాలా వరకు ఇండివిడ్యువల్ గానే  ఆడినా ఒక్కోసారి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కు గురయ్యేది ఆమె ఆట తీరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'వాటర్ ట్యాంక్' టాస్క్ లో తమపై ఫిజికల్ అయిన నిఖిల్ ను వదిలేసి తమ టీంలో ఆడిన గౌతమ్ ను నామినేట్ చేయడం. ఓ విధంగా ఆమెను ట్రోఫీకి దూరం చేసినది ఈ అంశాలే. ఇలాంటి మైనస్ లు ఉన్నా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సీజన్లో మొదటి నుంచి చివరి వరకూ మగవాళ్ళతో పోటీపడి మరీ టాస్కు ల్లో ఆడిన ప్రేరణ టాప్ 5కి 100% అర్హురాలు.

Also Read: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ