Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ

Bigg Boss Rohini: బిగ్ బాస్ ఇంటి నుంచి రోహిణి బయటకు వచ్చింది. ఎగ్జిట్ తర్వాత ఆవిడ ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ మీద కామెంట్స్ చేసింది. ఇంకా పృథ్వీ గురించి ఏం చెప్పిందో చూడండి.

Continues below advertisement

Rohini Exclusive Exit Interview: జబర్దస్త్ కామెడీ షోతో పాటు బుల్లితెరపై పలు కార్యక్రమాలు చేసిన రోహిణికి బిగ్ బాస్ కొత్త కాదు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది ఈ సారి 8వ బిగ్ బాస్ సీజన్ (Bigg Boss 8 Telugu)లో కూడా సందడి చేసింది. మూడో సీజన్ కంటే ఎనిమిదో సీజన్లో ఎక్కువ రోజులు ఉంది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల లిస్టులో ఆవిడ పేరు కూడా ఉంటుందని అభిమానులు ఆశించారు. అయితే అనూహ్యంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో రోహిణి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. 

Continues below advertisement

కప్పు గెలిచినా అంత ఆనందం రాదేమో!?
రోహిణి ఇంటర్వ్యూ చేసిన అర్జున్ అంబటి... బిగ్ బాస్ సీజన్ 3 తో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఎటువంటి ఫీలింగ్ ఇచ్చింది అని ప్రశ్నించారు. అప్పుడు రోహిణి ''ఈ సీజన్ నాకు ఫుల్ శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చింది. ఇన్ని వారాలు నేను బాగా ఆడాను. నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అయితే ఉంది'' అని సమాధానం ఇచ్చింది.

బిగ్ బాస్ ఇంటిలో రోహిణిని మిగతా కంటెస్టెంట్లు కొందరు చాలా మాటలు అన్నారు. ఆమె వీక్ అని, ఫిజికల్ టాస్కులు అస్సలు ఆడలేదు అని విమర్శలు చేశారు. ఆ విమర్శలకు రోహిణి దీటైన బదులు ఇచ్చారు. ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ల మీద విజయం సాధించి చూపించారు. ఆ విషయాలను అర్జున్ అంబటి ప్రస్తావిస్తూ, 'పృథ్వీ మీద మీరు ఆడి గెలవడం అనేది ఎంత హై ఫీల్ అయ్యారు' అని ప్రశ్నించగా... ''నా మీద విమర్శలు చేసినప్పుడు బాధపడ్డాను. కప్పు గెలిచినా సరే అంత ఆనందం రాదేమో..‌. పృథ్వీ మీద గెలిచినప్పుడు... ఆ ఒక్క మూమెంట్ నాకు ఎంతో హై ఇచ్చింది'' అని రోహిణి సంబరపడ్డారు. 

ఓటు అప్పీల్ రావడం వల్ల సేవ్ అవుతానని తాను అనుకోవడం లేదని రోహిణి స్పష్టం చేశారు. హరితేజ ఎలిమినేట్ కావడం వల్ల తనను నామినేట్ చేయలేదని ఒకవేళ మరొక వారం ఆవిడ బిగ్ బాస్ ఇంటిలో ఉండి ఉంటే తన నామినేట్ చేసేవారేమో అని అభిప్రాయపడ్డారు రోహిణి.

Also Read: బిగ్ బాస్ 8 తెలుగులో టాప్ 3 కన్ఫర్మ్ - మరి మిగిలిన ఇద్దరూ ఎవరు?


పృథ్వీకి, విష్ణుప్రియకు మధ్య కనెక్షన్ ఉంది!
విష్ణు ప్రియ గేమ్ గురించి అర్జున్ అంబటి ప్రశ్నించగా...‌ ఒక ప్రేక్షకురాలిగా తాను చూసిన విష్ణు ప్రియకు, ఇంటిలో విష్ణు ప్రియకు ఒక వ్యత్యాసం గమనించానని రోహిణి తెలిపారు. ఎందుకు విష్ణు గేమ్ పరంగా డైవర్ట్ అవుతుందనే నిరాశ తనకు ఉందని ఆవిడ స్పష్టం చేశారు ఆ తరువాత అర్జున్ అంబటి సూటిగా ఒక ప్రశ్న వేశారు. 'విష్ణు ప్రియకు, పృథ్వీకి మధ్య కంటెంటా? కనెక్షనా?' అని అడిగారు. ''వాళ్ల స్నేహితులు అయితే కనెక్షన్ అని చెప్పారు'' అని రోహిణి సమాధానమిచ్చారు. బిగ్ బాస్ ఇంటి నుంచి ఆల్రెడీ పృథ్వీ బయటకు వచ్చారు. విష్ణు ప్రియ బయటకు వచ్చిన తర్వాత కూడా పృథ్వీ, విష్ణుప్రియ మధ్య కనెక్షన్ కొనసాగుతుందా? లేదా?అనేది చూడాలి.

Also Read: బిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 98 రివ్యూ: కమెడియన్లని విన్నర్‌ను చేయరు... రోహిణిని బయటకు పంపిన ఆడియెన్స్.. నిఖిల్, గౌతమ్ పంచాయితీ సెట్టు

Continues below advertisement
Sponsored Links by Taboola