బిగ్ బాస్ సీజన్ 8 చివరికి వచ్చేసింది. మొదట్లో చెప్పగా సాగినా ప్రస్తుతం సీజన్ ఊపందుకుంది. మరొక రెండు వారాల్లో  బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే ప్రస్తుతం అందరి చూపు టాప్ 5 పైనే ఉంది. ఇప్పటికే తొలి ఫైనలిస్ట్ గా టికెట్ టు ఫినాలే అవినాష్ అందుకున్నాడు. మరి మిగిలిన  నలుగురు ఎవరు?


టాప్ 5లో గౌతమ్, నిఖిల్ కన్ఫర్మ్
టాప్ ఫైవ్ లో మిగిలిన నాలుగు స్థానాల్లో రెండు బెర్త్ లు ఖరారైయిపోయినట్టే. సోషల్ మీడియా ట్రెండ్స్ ను బట్టి  గౌతమ్,నిఖిల్ టాప్ 5 కు వెళ్లిపోతారు. నిఖిల్ కి మొదటి నుంచి ఉన్న సీరియల్ ఫాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ హెల్ప్ అయితే టాస్క్ ల్లో తను ఆడే విధానం చాలామందిని మెప్పించింది.ఇక వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన  డాక్టర్ గౌతమ్ సోలో బాయ్ గా ఆడుతున్నాడు. ఎవరి మీద ఆధారపడకుండా  జెన్యూన్ గా టాస్కులు ఆడాలని చూస్తున్న గౌతమ్ కు చాలామంది కొత్త ఫ్యాన్స్ పుట్టుకు వచ్చారు. పైపెచ్చు నామినేషన్స్ లో తనని మిగిలిన ఆటగాళ్లు టార్గెట్ చేయడం గౌతమ్ కృష్ణ పై  ఆడియన్స్ లో సింపతీని క్రియేట్ చేసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే గౌతమ్, నిఖిల్ టాప్ ఫైవ్ లో ఉండడం ఖాయం. అంతే కాదు సీజన్ 8 విన్నర్ సైతం వీళ్ళిద్దరి లోనే  ఒకరు కావడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే.


మిగిలిన రెండు స్థానాలకు నలుగురు పోటీ
అవినాష్, గౌతమ్,నిఖిల్ తప్పిస్తే టాప్ ఫైవ్ లో  మిగిలిన రెండు స్థానాలకు రోహిణి, ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియ పోటీ పడుతున్నారని జనాలు భావించారు. అయితే... గడిచిన నాలుగు వారాలుగా రోహిణి తన సత్తా చాటినప్పటికీ... నిన్న (శనివారం) ఎలిమినేట్ అయ్యింది. శక్తికి మించి మరీ పోటీపడుతూ బిగ్ బాస్ హౌస్ కు చివరి మెగా చీఫ్ కూడా అయింది. అయితే ఆడియన్స్ ఆవిడను బయటకు పంపారు. మరి మిగతా ఇద్దరు ఎవరు? ముగ్గురిలో ఫైనల్‌కు వెళ్లే ఇద్దరు ఎవరు?


వరంగల్ కుర్రాడు నబీల్ కు ఛాన్స్ ఉందా?
'బిగ్ బాస్' సీజన్ 8 మొదట్లో విన్నర్ ఎవరూ అంటే నబీల్ పేరే వినిపించే స్థాయిలో ఆడాడు నబీల్ అఫ్రీది. కానీ  సీజన్ మధ్యలో ఎందుకో డల్ అయ్యాడు. ప్రస్తుతం మళ్ళీ ఫామ్ అందుకున్నా అక్కడక్కడ తడబడుతున్నాడు. మరి నబీల్ టాప్ ఫైవ్ లో ఉంటాడా లేదో  ఈవారం సేవ్ అవ్వడం పై ఆధారపడి ఉంది. తనకంటూ ఉన్న స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ నబీల్ కు బలం.


ప్రేరణ ఆట సూపర్... కానీ మాటే సమస్య
ఒకానొక దశలో ఈ సీజన్ విన్నర్ అనిపించిన ప్రేరణ అనవసరంగా తప్పటడుగులు వేసింది. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడే ప్రేరణ ఈమధ్య విపరీతమైన కోపం చూపిస్తూ ఆటను డల్ చేసుకుంది. ఇతర కంటెస్టెంట్ లపై అప్పుడప్పుడు నోరు జారుతూ ఆమె తన గ్రాఫ్ ని కాస్త దిగజార్చుకుంది. అయితే ఆమె టాప్ ఫైవ్ కు అర్హురాలు అనేదే చాలా మంది అభిప్రాయం. మరి ఎక్స్ కంటెస్టెంట్స్ నుండీ ఎవిక్ట్ అయిన హౌస్ మేట్స్ నుండి అనుకున్న ఫీడ్ బ్యాక్ తో తన ఆటలో ఈ వారం మార్పులు చేసుకుంటే ఆమెకు టాప్ 5 ఛాన్స్  తప్పకుండా ఉంటుంది.


Also Read: బిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 97 రివ్యూ: బే అంటూ నోరు జారిన నిఖిల్... సంచాలక్‌గా ప్రేరణ పక్షపాతం... ఓట్ అప్పీల్ టాస్క్ పూర్తి


విష్ణుప్రియ - ఏమో గుర్రం ఎగరావచ్చు..!
 టాస్కుల్లో నిల్లు.. కానీ కంటెంట్ ఫుల్  అన్నట్టు నడిచింది విష్ణు ప్రియ ప్రయాణం ఈ సీజన్లో. పృథ్వితో కలిసి ఆమె నడిపిన ట్రాక్ కొంతమందిని విసిగిస్తే మరి కొంతమందికి అదే నచ్చింది. సోషల్ మీడియాలో తనకంటూ ఉన్న  ప్రీ -ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ విష్ణు ప్రియకు అసలైన బలం. ఎంతమంది స్నేహితులు వచ్చి ఆట మార్చుకోమని  చెప్పినా తాను జెన్యూన్ గానే ఉంటానంటూ విష్ణుప్రియ చెప్పిన మాటలు చాలామందికి నచ్చాయి. అయితే ఈ వారం పృథ్వి వెళ్ళిపోవడం  విష్ణు ప్రియ కు ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో చూడాలి. పృద్వి ఎలిమినేషన్  విష్ణు ప్రియ కు సింపతి తెచ్చిపెడితే ఆమె టాప్ ఫైవ్ కు గ్యారెంటీగా వెళ్లి పోతుంది. అలా కాదు విష్ణుప్రియ నః ఉంచి టాస్కులు బాగా ఆడే  పృథ్విని ఎలిమినేటి చేశారు అనే ఫీలింగ్ ఆడియన్స్ లోకి వెళితే అదే ఆమె ఆటకు అడ్డంకి గా మారే ప్రమాదం ఉంది. మరి చూడాలి రోహిణి, నబీల్, ప్రేరణ, విష్ణు ప్రియ  లలో ఎవరు టాప్ ఫైవ్ లోని మిగిలిన రెండు బెర్త్ లు దక్కించుకుంటారో..!


Also Readబిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 96 రివ్యూ: నేను నచ్చితే ఓట్లు వేసి గెలిపించిండి... వేడుకున్న విష్ణుప్రియ, - సంచాలక్‌గా రోహిణి గందరగోళం