Rohini Elimination Round: బిగ్ బాస్ ఇంట్లో పద్నాలుగో వారాంతంలో డబుల్ ఎలిమినేన్ అని శనివారం నాడు నాగార్జున షాక్ ఇచ్చాడు. రోహిణి శనివారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయింది. తాను ఎలిమినేట్ అవుతానని ముందే రోహిణి గ్రహించినట్టుగా ఉంది. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు ఈ వారం చేసిన తప్పుల్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఈ శనివారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే.. 

Continues below advertisement


ఇదే నా లాస్ట్ టీ.. ఫస్ట్ టైం నామినేట్ అయ్యా.. చిన్న భయం ఉంది..టాప్ 5లో ఉండాలని ఉంది.. గెలవాలని ఉంది.. అంటూ రోహిణి తనలో తాను అనుకుంది. ఇక మారుతి డిజైర్ టాస్కుని బిగ్ బాస్ పెట్టాడు. ఆ తరువాత నాగార్జున వచ్చి కంటెస్టెంట్లకు ఈ పద్నాలుగు వారాల్లో కలిగి రిగ్రేట్స్‌ను చెప్పమన్నాడు. ఇందులో భాగంగా అవినాష్ వచ్చి తాను మెగా చీఫ్‌గా ఉన్న టైంలో రోహిణి, విష్ణు మధ్య గొడవను పరిష్కరించలేకపోయానని అన్నాడు. ఆ తరువాత ప్రేరణ వచ్చి తాను మెగా చీఫ్‌గా ఉన్న టైంలో కాస్త సాఫ్ట్‌గా వ్యవహరించాల్సిందని చెప్పింది. ఈ వారం నువ్వు సంచాలక్‌గా సరైన నిర్ణయాలు తీసుకోలేదని ప్రేరణని నాగ్ మందలించాడు.


రోహిణి వచ్చి.. ఎగ్ టాస్కులో అవినాష్‌ను అవుట్ చేయడమే తన రిగ్రేట్ అని చెప్పింది. మరి ఇది గ్రూపు గేమ్ కాదా? అంటూ గౌతమ్‌ని నాగ్ అడిగాడు. ఆపై నబిల్ వచ్చి రెండో సారి మెగా చీఫ్ కాలేకపోయాను.. టాస్కు ఆడలేకపోయాను అదే తన రిగ్రేట్ అని అన్నాడు. ఆ తరువాత గౌతమ్ తాను ఎంట్రీ ఇచ్చిన మొదటి వారంలో కామెడీ టాస్కుకి సీరియస్ అయ్యానని, అదే తన రిగ్రేట్ అని అన్నాడు. మరి ఈ వారం లేదా? అని నాగ్ అడిగితే.. నిఖిల్‌తో జరిగిన గొడవల గురించి చెప్పాడు. చివరకు అటు తిప్పి.. ఇటు తిప్పి గౌతమ్‌దే తప్పు అని నాగార్జున ఒప్పించాడు. నిఖిల్‌కు సారీ చెప్పించాడు.


పాత వీడియోలు వేసి అసలు ఆడుకున్నావ్ అనే పదాన్ని నిఖిల్ ఎక్కడ వాడాడు అంటూ నిలదీశాడు. వాడుకోవడం అనేది ఎంత పెద్ద పదం అంటూ గౌతమ్‌ని రిగ్రేట్ ఫీల్ అయ్యేలా చేశాడు. చివరకు గౌతమ్ తనదే తప్పు అని ఒప్పుకుని, నిఖిల్‌కు సారీ చెప్పాడు. నిఖిల్ తాను ఇన్ని రోజులు ఎక్కడా నోరు జారలేదని, కానీ గౌతమ్‌ను అలా అనకుండా ఉండాల్సిందని అన్నాడు. బే అని వాడకుండా ఉండాల్సిందని గౌతమ్‌కు నిఖిల్ సారీ చెప్పాడు. కానీ ఆ సారీ మనస్ఫూర్తిగా చెప్పావా అంటూ నిఖిల్‌ను నాగ్ నిలదీశాడు. చివరకు నిఖిల్, గౌతమ్‌లు హగ్ చేసుకున్నారు. వివాదానికి పుల్ స్టాప్ పెట్టేసుకున్నారు.


Also Readబిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 97 రివ్యూ: బే అంటూ నోరు జారిన నిఖిల్... సంచాలక్‌గా ప్రేరణ పక్షపాతం... ఓట్ అప్పీల్ టాస్క్ పూర్తి


ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని అవినాష్‌ని గెస్ చేయమన్నాడు నాగ్. దీంతో అవినాష్ రోహిణి ఎలిమినేట్ అవుతుందని కరెక్ట్‌గా గెస్ చేశాడు.  దీంతో మరోసారి సివంగిలా ఆడే లేడీ కంటెస్టెంట్లు, కమెడియన్లను జనాలు విన్నర్ చేయలేరు.. విన్నర్ మెటీరియల్ కాదని ఆడియెన్స్ అభిప్రాయ పడతారు.. కమెడియన్లు అంటే చిన్న చూపు అని రోహిణి, తేజలు మాట్లాడుకున్నదే నిజం అయింది. అసలు టాప్ 5లో ఉండే అన్ని అర్హతలు రోహిణికి ఉన్నాయి. కానీ రోహిణికి సరైన పీఆర్ టీం లేకపోవడం, ఆర్గనైజ్డ్ ఓట్లు వేయించే వాళ్లు లేకపోవడంతో ఇలా ఈ సీజన్‌లో మొదటి సారిగా నామినేషన్‌లోకి వచ్చి ఇలా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.


ఇక స్టేజ్ మీదకు వచ్చిన రోహిణి తన జర్నీ చూసి ఎమోషనల్ అయింది. అవినాష్, ప్రేరణ, గౌతమ్‌లను హీరోల కేటగిరీల కింద పెట్టింది. నబిల్, నిఖిల్, విష్ణులను విలన్ల కేటగిరీ కింద పెట్టింది రోహిణి. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో విష్ణు ప్రియ ఎలిమినేట్ కానున్నట్టుగా లీకులు వచ్చేశాయి. మరి సండే ఎపిసోడ్ ఎలా సాగుతుందో చూడాలి.


Also Readబిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 96 రివ్యూ: నేను నచ్చితే ఓట్లు వేసి గెలిపించిండి... వేడుకున్న విష్ణుప్రియ, - సంచాలక్‌గా రోహిణి గందరగోళం