Avinash Afraid And Serial Batch Task: బిగ్ బాస్ ఇంట్లో చివరి వారాన్ని టాప్ 5 కంటెస్టెంట్లు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ జాలీగా ఫన్నీ, సిల్లీ టాస్కులతో కానిచ్చేస్తున్నారు. సోమవారం నాటి ఎపిసోడ్‌లో సీరియల్ బ్యాచులు వచ్చాయి. స్టార్ మా పరివారం, బీబీ పరివారం అంటూ టాస్కులు పెట్టాడు. ప్రైజ్ మనీని రౌండ్ ఫిగర్ చేయాలని బిగ్ బాస్ అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చే సీరియల్ బ్యాచులతో టాప్ 5 కంటెస్టెంట్లు పోటీ పడి ఆ మిగిలిన డబ్బుల్ని గెల్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.
నువ్వుంటే నా జతగా అనే సీరియల్ నుంచి దేవ (అర్జున్ కళ్యాణ్), మిథున (అను) వచ్చారు. వారితో కంటెస్టెంట్లు కాస్త సందడి చేశారు. అవినాష్, గౌతమ్ ఇద్దరూ కూడా నబిల్, ప్రేరణలా యాక్ట్ చేసి నవ్వించారు. ఆ తరువాత 12, 489 వేల కోసం టాస్క్ పెట్టాడు. ఇందులో బీబీ పరివారం గెలిస్తే.. అది యాడ్ అవుతుందని, స్టార్ మా పరివారం గెలిస్తే ఆ అమౌంట్ ప్రైజ్ మనీలోంచి కట్ అవుతుందని అన్నాడు. కానీ ఆ టాస్కులో అర్జున్, అను కంటే.. నబిల్, ప్రేరణ బాగా ఆడి డబ్బులు గెలిచేస్తారు.
ఆ తరువాత ఇంటి సభ్యులంతా కలిసి దొంగా పోలీస్ ఆట ఆడారు. అవినాష్ అందరినీ పట్టుకుని ఆ ఆటలో గెలిచారు. కానీ నబిల్ వంతు వచ్చినప్పుడు అందరూ కలిసి ఇన్ ఫినిటీ రూంలో దాక్కున్నారు. అందరూ బయటకు వచ్చారు. కానీ అవినాష్‌ను మాత్రం బిగ్ బాస్ లోపలే లాక్ చేశాడు. అవినాష్‌ను లోపలే పెట్టి కాస్త భయపెట్టించాడు. దీంతో అవినాష్ జడుసుకున్నాడు. అదంతా యాక్టింగ్ అని తెలుస్తూనే ఉంది. కాస్త ఎక్స్ ట్రాలే చేసినా కూడా అవినాష్ నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ బయటకు వచ్చిన తరువాత నిజంగానే భయపడ్డట్టు.. పడిపోయిందిరా అంటూ అవినాష్ చెప్పాడు.
ఆ తరువాత ఇంట్లోకి ఇళ్లు, ఇళ్లాలు, పిల్లలు అనే సీరియల్ నుంచి రామరాజు (ప్రభాకర్), వేదవతి (ఆమని) ఎంట్రీ ఇచ్చారు. వారితో కాసేపు కంటెస్టెంట్లు ముచ్చట్లు పెడతారు. కొన్ని టాస్కులు కూడా బిగ్ బాస్ ఇస్తాడు. అయితే సీరియల్ కథను ప్రభాకర్ చెప్పి.. లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అరెంజ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అని నిఖిల్‌ను అడిగారు. లవ్ మ్యారేజ్‌కే నిఖిల్ ఓటు వేశాడు. ఆ తరువాత బిగ్ బాస్ 15, 113 కోసం మరో టాస్క్ పెట్టాడు. అందులో కూడా బీబీ పరివారమే గెలుస్తుంది. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్లో ఏ సీరియల్ బ్యాచ్ వస్తుందో చూడాలి.