Bigg Boss 8 Telugu Grand Finale - Top 5th Contestant: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ముసిగింది. ఇందులో నిఖిల్ విజేతగా నిలిచాడు. అతని కంటే ముందు ఫైనలిస్ట్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నది మాత్రం అవినాష్ (Mukku Avinash). అయితే టాప్ 5లో చివరి స్థానంలో నిలిచాడు. ఎందుకిలా జరిగింది? అతని ఆటలో ప్లస్, మైనస్ లేంటి? ముందుగా ప్లస్ పాయింట్స్ చూసి తర్వాత మైనస్ విషయానికి వెళ్దాం. 

అవినాష్‌కు కలిసి వచ్చిన పాయింట్స్ ఇవేవైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఈసారి లక్కు ప్లస్ హార్డ్ వర్క్ లతో  ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా వైల్డ్ కార్డుగానే హౌస్ లోకి 11వరోజు ఎంట్రీ ఇచ్చి 91వ రోజున టాప్ 7 కంటెస్టెంట్ గా ఎవిక్ట్ అయ్యాడు. అయితే అప్పుడు పూర్తిగా కామెడీ  పైనే ఆధారపడి ఆటసాగించాడు అవినాష్. చివరి రెండు వారాల్లో సింపతి వాడాలని చూసినా వర్క్ అవుట్ కాలేదు. కానీ సీజన్ 8లో మాత్రం కొత్త అవినాష్ ను చూసారు ఆడియన్స్. చెప్పగా సాగుతున్న సీజన్ 8కు రిలీఫ్ ఇచ్చింది ఒక విధంగా అవినాష్ నే.

వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చింది మొదలు సీజన్ 8 లో ఎంటర్టైన్ మెంట్ పార్ట్ మొత్తాన్ని తన భుజాల మీదే మోసాడు. రోహిణి, టేస్టీ తేజలతో కలిసి ఆడియన్స్ ని నవ్విస్తూ సీజన్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఇక టాస్కుల్లో సైతం గతంతో పోలిస్తే చాలా అద్భుతంగా ఆడాడు. తనను ఛాలెంజ్ చేసిన పృథ్వి ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ను కూడా ఓడించి అటు చీఫ్ అయ్యాడు ఇటు మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. కచ్చితంగా ఈ సీజన్తో పాపులారిటీ పరంగా తన గ్రాఫ్ నైతే బాగా పెంచుకున్నాడు. సీజన్ 4 తో పోలిస్తే  సింపతీ కార్డు అస్సలు వాడనే వాడలేదు. కమెడియన్స్ టాప్ లో ఉండలేరు అంటూ బిగ్ బాస్ పై ఉన్న ఒక విమర్శను ఛాలెంజ్ చేస్తూ టాప్ ఫైలో చేరాడు.

Also Read: బిగ్ బాస్ ఫినాలే... ప్రేరణ ఆటలో ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి? బిస్‌బాస్‌ 8 విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా?

అవినాష్ ఆటలో మైనస్‌లు ఏంటి? ఎందుకు టాప్ 5తో సరిపెట్టుకున్నాడు?బిగ్ బాస్ (Bigg Boss 8)లో ఏ హౌస్ మేట్ కైనా ఓటింగ్ పెరగాలంటే ఖచ్చితంగా తను నామినేషన్స్ లోకి వస్తూ పోతూ ఉండాలి. అవినాష్ కి అదే ఈ సీజన్లో  మైనస్ అయింది. తను ఎక్కువగా నామినేషన్ లోకి వచ్చింది లేదు. దానితో తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు. ఫినాలే స్టేజి మీద అవినాష్ కూడా ఆ మాటే చెప్పాడు. అతని ఆటలోని మరో మైనస్ పాయింట్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేకపోవడం. నామినేషన్స్ లో ఆర్గ్యూ చేసే టైంలో అవినాష్ అవతల వాళ్ళకి చాలాసార్లు దొరికిపోతుంటాడు. అదే సమయంలో నామినేషన్స్ లో అవినాష్ పెట్టే పాయింట్స్ కూడా చాలా సిల్లీగా ఉండడం అతనికి మైనస్ అయ్యాయి. ఆ టైంలో కాన్ఫిడెంట్ గా తన పాయింట్స్ పెట్టలేకపోవడం కూడా అవినాష్ ఆటకు మైనస్. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ సీజన్ లో అవినాష్  ఆట తీరు ఫస్ట్ ఫైనలిస్ట్ గా మారిన వైనం నెక్స్ట్ సీజన్ లలో వచ్చే కమెడీయన్స్ కు కాన్ఫిడెన్స్ పెరిగేలా చేస్తుంది అనడంలో డౌట్ లేదు.

Also Readవిష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ