బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి ఒక కేక్ పంపించిన బిగ్ బాస్ అది తినే అర్హత ఎవరికి ఉందని ప్రశ్నించారు. ఆ కేక్ ను ఇన్వెస్టిగేట్ చేసే పనిలో పడ్డారు హౌస్ మేట్స్. అయితే ఈరోజు ఎపిసోడ్ లో సన్నీ ఆ కేక్ ను తినేసినట్లు ఇప్పటికే విడుదలైన ప్రోమోలో కనిపించింది. మరి దాని పరిణామాలేంటో ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. 


Also Read: 'నందమూరి నాయక.. ఏం ఎనర్జీ నాయక'..


ఇందులో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్ ని బీబీ హోటల్ గా మార్చేశారు. చెఫ్స్, వెయిటర్స్ గా శ్రీరామ్, షణ్ముఖ్ లను నియమించారు. ఒక కాంటెస్ట్ లో గెలిచి 2 నైట్స్, 3 డేస్ కోసం మొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్ కి వచ్చిన గెస్ట్ గా సన్నీ కనిపించబోతున్నాడు. ప్రోమోలో సన్నీ కామెడీ చేస్తూ కనిపించాడు. యానీ మాస్టర్ దగ్గరకు వెళ్లి 'మీకెవరైనా చెప్పారా..? మీరు పిల్లిలా ఉంటారని' అంటూ ఫన్ చేశాడు.


షణ్ముఖ్ పాట పాడగా.. దానికి రవి-ప్రియాంక ఫన్నీగా డాన్స్ చేస్తూ కనిపించారు. డాన్ కూతురి పాత్రలో సిరి.. షణ్ముఖ్ కి చుక్కలు చూపించింది. అతడితో సేవలు చేయించుకోవడం పాటు.. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ ని చెంచా తీసుకొని కొలిపిస్తూ కనిపించింది. ఆ తరువాత రవిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అతడిని సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. 




Also Read:'ఊరనాటు' సాంగ్ పై సెలబ్రిటీల రియాక్షన్.. 'మెంటల్' అంటూ సమంత కామెంట్..


Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..


Also Read:  రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...


Also Read: పెళ్లైందని మర్చిపోయారా… ఆమెతో రొమాన్స్ ఏంటి..


Also Read: సీక్రెట్ రూమ్ లో జెస్సీ.. రవికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి