వెటరన్ హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్(74) కారు ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం లాస్ ఏంజిల్స్ లో నాలుగు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఓ కారులో ఆర్నాల్డ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కానీ ఈ యాక్సిడెంట్ లో ఓ మహిళకు గాయాలవ్వడంతో వెంటనే ఆమెని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
ఆర్నాల్డ్ కి మాత్రం చిన్న దెబ్బ కూడా తగలేదని ఆయన స్పోక్స్ పెర్సన్ మీడియాకు వెల్లడించారు. కానీ గాయాలపాలైన మహిళ గురించి ఆర్నాల్డ్ బాధపడుతున్నారని.. యాక్సిడెంట్ జరిగిన దగ్గర కాసేపు ఉండి సదరు మహిళను హాస్పిటల్ కు చేర్చడానికి సాయం చేశారని తెలిపారు. మద్యం, డ్రగ్స్ వల్ల ఈ యాక్సిడెంట్ అవ్వలేదని.. డ్రైవర్ల నిర్లక్ష్యం వలనే జరిగిందని పోలీసులు వెల్లడించారు.
ఈ యాక్సిడెంట్ లో ఆర్నాల్డ్ ఉండడంతో హాలీవుడ్ మీడియా పలు కథనాలు ప్రచురిస్తోంది. కొన్ని మీడియా వర్గాలు ఆర్నాల్డ్ కారు నడిపి మహిళకు యాక్సిడెంట్ చేశారని వార్తలు రాశారు. దీంతో ఆయన స్పోక్స్ పెర్సన్ అందులో నిజం లేదని తేల్చిచెప్పారు. హాలీవుడ్ లో ఆర్నాల్డ్ యాక్షన్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన నటించిన 'కమాండో', 'టెర్మినేటర్', 'టోటల్ రీకాల్', 'ట్రూ లైస్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.
Also Read: చై-సామ్ విడాకులు.. ఆ చెత్త వార్తలు బాధపెట్టాయంటున్న నాగ్..
Also Read: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..?
Also Read: నాని సినిమాలో మలయాళ హీరోకి ఛాన్స్..
Also Read: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..