టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి మూడు నెలలు దాటేసింది. అయినప్పటికీ వీరికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్న సమయంలో సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరిగాయి. సమంత బోల్డ్ రోల్స్ లో నటించడం అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని.. ఆమెకి రూల్స్ పెట్టడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


తాజాగా ఈ వార్తలపై నాగచైతన్య తండ్రి, ప్రముఖ హీరో నాగార్జున స్పందించారు. రీసెంట్ గా చైతుతో కలిసి ఓ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు నాగ్. ఈ సందర్భంగా ఆయనకు చైతు-సమంతల విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. విడాకుల సమయంలో వచ్చిన వార్తలపై ఆయన మాట్లాడుతూ.. కొంతమంది కావాలనే చెత్త వార్తలు సృష్టించారని.. తనపై తప్పుడు వార్తలు రాసినా పెద్దగా పట్టించుకోలేదు కానీ తన ఫ్యామిలీ గురించి నెగెటివ్ గా వార్తలు రాయడం మాత్రం చాలా బాధించిందంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. 


ఇదే విషయంపై చైతు మాట్లాడుతూ.. అలాంటి వార్తలను పట్టించుకోనని అన్నారు. రీసెంట్ గా 'బంగార్రాజు' సినిమా ప్రమోషన్స్ లో కూడా పరస్పర అంగీకారంతోనే విడిపోయామని.. ఇప్పుడు సమంత, తను ఇద్దరం సంతోషంగా ఉన్నామని అన్నారు చైతు. 2017లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు.


ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సమంత 'యశోద' సినిమాలో నటిస్తున్నారు. అలానే ఓ బైలింగ్యువల్ సినిమా, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరోపక్క చైతు 'థాంక్యూ' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్నారు. ఈ ఏడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 


Also Read: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..?


Also Read: నాని సినిమాలో మలయాళ హీరోకి ఛాన్స్..


Also Read: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..