నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. అన్ని భాషల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ రన్‌లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ చక్కటి ఆదరణ పొందుతుంది.
ఇదిలా ఉండగా.. శనివారంనాడు ఈ సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్ రిలీజ్ చేసింది చిత్రబృందం. వేశ్యలతో వారి వృత్తికి సంబంధించి నాని తను రాసిన లైన్స్ ను వారితో చెప్పగా.. 'ఇంత తెలిసినవాడివి.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ఓ వేశ్య అడుగుతుంది. దానికి నాని 'ఖచ్చితంగా చేసుకుంటాను.. నిన్ను ప్రేమించిన రోజు' అని బదులిస్తాడు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని.. వాసు, శ్యామ్ సింగరాయ్ అనే రెండు పాత్రలను పోషించారు. బెంగాల్ బ్యాక్ డ్రాప్ వచ్చే 'శ్యామ్ సింగరాయ్' సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. దేవదాసి వ్యవస్థపై నాని పోరాడే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Also Read: నాని సినిమాలో మలయాళ హీరోకి ఛాన్స్..
Also Read: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..