కురుక్షేత్రం ముగిసిన తర్వాత 36 ఏళ్లలో కృష్ణుడు కూడా మరణిస్తాడని, యాదవులంతా కొట్టుకు చస్తారని గాంధారి శాపం ఇస్తుంది. ఆ తర్వాత ద్వారకకు వెళ్లిపోయిన శ్రీకృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడికి పుట్టిన కొడుకు పేరు సాంబుడు. ఓసారి సప్తరుషులు శ్రీకృష్ణుడి దర్శనార్థం ద్వారకకు వెళతారు. వాళ్లు రాజవీధిలో వస్తుండడం చూసిన యాదవులకు దుర్భుద్ధి పుట్టింది. కృష్ణుడి కొడుకు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి స్వాముల దగ్గరకు తీసుకొచ్చి.. అయ్యా ఇది భద్రుడి భార్య..దీనికి సంతానం కలుగుతుందా అని ఆటపట్టిస్తారు. అసలు విషయం గ్రహించి ఆగ్రహించిన సప్తరుషులు..."వీడు కృష్ణుడి కొడుకు సాంబుడని తెలుసు... యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి వాసుదేవుడిని దర్శించుకోకుండానే వెను తిరుగుతారు. 


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఆ తర్వాత కృష్ణుడు ఇదంతా తెలుసుకుని జరగవలసింది జరిగే తీరుతుందనుకుని ఊరుకుంటాడు. ఆ మర్నాడు సాంబుడి కడుపులోంచి భయంకరంగా వున్న ఒక రోకలి పుట్టింది. యాదవులంతా భయంతో పరిగెత్తుకు వెళ్ళి ఆ సంగతి వసుదేవుడికి చెప్పగా.. ఆ రోకలిని పిండిచేసి సముద్రంలో కలపండని ఆజ్ఞాపిస్తాడు. యాదవులంతా ఆయన చెప్పినట్టే చేశారు కానీ.. గాంధారి శాపం, మహర్షుల ఆగ్రహం ఎక్కడికి పోతాయి...రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణంలో చాలా మార్పులొస్తాయి. ఎన్నో ఉత్పాతాలు కనిపించాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అపవడం, పగలు మేకలు నక్కల్లా కూయడం ,  ఆవులకు గాడిదలూ, ముంగిసలకు ఎలుకలూ, కుక్కలకు పిల్లులూ పుట్టాయట. కృష్ణబలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ సజ్జనులను బాధపెట్టడం మొదలుపెట్టారు. గురువులను అవమానించారు. స్త్రీలు ఇష్టం వచ్చినట్లు సంచరించారు. అప్పుడే వేడివేడిగా వండిన ఆహారపదార్థాలు కూడా పురుగులు పట్టడం మొదలుపెట్టాయి. వరుస అశుభ సూచనలు చూసిన కృష్ణుడు గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైందనుకున్నాడు.


Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
ఊరిలో కన్నా తీర్థం సమీపంలో చనిపోవడం మంచిదని భావించిన కృష్ణుడు యాదవులను పిలిచి.. సముద్రానికి జాతర చేయాలి అంతా బయల్దేరండని ఆజ్ఞాపిస్తాడు. రాబోతున్న ప్రమాదాన్ని ఊహించని యాదవులంతా ఆహారపదార్థాలు సమకూర్చుకుని, అందంగా అలంకరించుకుని జాతరకు వెళతారు. అంతా సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళతాడు. ప్రభువైన కృష్ణుడి ఎదురుగానే మత్తుపానీయాలు సేవించడం, అనవసర మాటలు మాట్లాడటం, పిచ్చిపిచ్చిగా నవ్వడం చేశారు. "ప్రద్యుమ్నా! అడుగో కృతవర్మని చూశావా! నిద్రపోతున్న వాళ్ళను చంపాడు. ఏంపౌరుషంరా! ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా?" అని సాత్యకి కృతవర్మను ఎగతాళి చేశాడు. "అర్జునుడు చెయ్యి నరికితే శాంతించిన భూరిశ్రవుణ్ణి  చంపావు నువ్వు. అది మరిచిపోయావా? నువ్వు చేసింది రణనీతి కాబోలని" కృతవర్మ ఆక్షేపించాడు. ఇద్దరి మధ్యా వాగ్వాదం పెరిగి కృతవర్మ కంఠం నరికేశాడు సాత్యకి. సముద్రతీరంలో తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిముషం  ఆ కత్తికి ఆక్రమించి ఉంది. ఆ తర్వాత కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగా వివాదం పెరిగింది. సముద్ర తీరంలో మొలిచిన తుంగ పీకి ఒకర్నొకరు కొట్టుకుని అంతా ప్రాణాలు విడుస్తారు. అప్పుడు వాళ్లు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే తుంగగా మొలిచి..అదే వాళ్ల యుద్ధ సాధనంగా మారి యాదవుల నిర్మూలనకు కారణమైంది.  


దారుకుడూ, బభ్రుడూ తప్ప మిగిలిన యాదవులంతా నాశనమయ్యారు. వాళ్ళిద్దర్నీ వెంటబెట్టుకుని బలరాముడు వెళ్ళినమార్గానే కృష్ణుడు వెళ్లిపోతాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం కృష్ణుడు అవతారం చాలిస్తాడు. 


Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి