Moscow Model Bridge AT Hussain Sagar: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ప్లాన్ చేసింది. ఇదివరకే విశ్వనగరంలో పలు చోట్ల మన ఖ్యాతిని చాటేలా పలు నిర్మాణాలు చేపట్టింది. కొన్ని చోట్ల భిన్నమైన బ్రిడ్జిలు ఏర్పాటు చేసి నగర శోభను మరింత పెంచడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్ వద్ద అద్భుత కట్టడానికి వ్యూహాలు రచించింది.
రష్యా రాజధాని మాస్కోలో ఏర్పాటు చేసిన ఓ వంతెన తరహా ఆకర్షణీయమైన నిర్మాణాన్ని నగరం నడిబొడ్డున తీసుకురానున్నారు. హుస్సేన్ సాగర్ చెంత ఓ తేలియాడే వంతెనను ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ప్లాన్ ఇదివరకే సిద్ధం చేయగా ఆ విషయాన్ని హెచ్‌ఎండీఏ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ షేర్ చేసుకున్నారు. రష్యాలోని మాస్కోలో జర్యాడే పార్కులో నదిపై నిర్మించిన తేలియాడే వంతెన తరహాలో పీవీఎన్ఆర్ ఘాట్ వద్ద ‘వీ’ ఆకారంలో నిర్మించేందుకు ప్లాన్ చేశారు. 2022 ఆఖరు నాటికి వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. నగరాన్ని పర్యాటక ప్రాంతంగా, మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఇది దోహదం చేయనుంది.
వంతెన ఎలా ఉంటుందంటే..
హుస్సేన్ సాగర్ మీదకు నిర్మించనున్న ఈ వంతెన వి ఆకారంలో ఉంటుంది. అయితే మాస్కోలోని వంతెన దాదాపు 70 మీటర్ల పొడవుతో నిర్మించారు. మెస్వ్యా నది మీద వేలాడే వంతెన ఉండగా.. కింద నీళ్లు ప్రవహిస్తుంటాయి. కింద రోడ్డుపై నుంచి ఎలాంటి అటాచ్‌మెంట్ లేకుండా వేలాడుతున్నట్లుగా వంతెన అద్భుతంగా కనిపిస్తుంది. దీంతో అక్కడ పర్యాటకంగా ఇది చాలా ఫేమస్. వంతెన మొత్తం పొడవు 244 మీటర్లు,
ఆ వంతెనపై ఒక్కసారి 2400 మంది వరకు ఉన్నా నిర్మాణానికి ఏమీ కాదు. ఇలాంటి వంతెన వస్తే పర్యాటకంగా హైదరాబాద్‌కు మరింత ఆకర్షణ రానుంది. గతంలో అనుకున్న కొన్ని ప్రాజెక్టుల మాదిరిగా ఈ వేలాడే వంతెన నిలిచిపోయే ఛాన్స్ లేదు. తప్పకుండా పనులు మొదలుపెట్టి ఈ ఏడాది ఆఖర్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.
Also Read: Mahesh Babu: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?