గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ దంపతులు సరోగసీ పద్ధతి ద్వారా తమకు తొలి సంతానం కలిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. చిన్నారి జననం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అదే సమయంలో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని ఇరువురూ ఓ విజ్ఞప్తి చేశారు. నిక్, ప్రియాంక దంపతులు తమకు బిడ్డ జన్మించిన సంగతి చెప్పారు. కానీ, అమ్మాయి పుట్టిందా? అబ్బాయి పుట్టాడా? అనేది చెప్పలేదు.
బాలీవుడ్ సమాచారం ప్రకారం... ప్రియాంకా చోప్రా - నిక్ జోనాస్ దంపతులకు అమ్మాయి పుట్టింది. డాక్టర్లు ఇచ్చిన డెలివరీ డేట్ కంటే పన్నెండు వారాల ముందు పాపాయి జన్మించిందట. 27వ వారంలో భూమ్మీదకు వచ్చింది. బిడ్డకు జన్మ ఇచ్చిన ఆవిడ... గతంలో ఇదే విధంగా నలుగురికి జన్మ ఇచ్చారట. సథరన్ కాలిఫోర్నియా ఆస్పత్రిలో ప్రసవం జరిగింది.
సరోగసీ ద్వారా ప్రియాంకా చోప్రా బిడ్డకు జన్మ ఇవ్వడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాన్ని సోషల్ మీడియాలో కొందరు వెలిబుచ్చారు. ఆమె వయసు 39 ఏళ్లు కావడంతో సంతానోత్పత్తి సమస్య ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే... అటువంటి సమస్యలు ఏమీ లేవని, బిజీ షెడ్యూల్స్ వల్ల కన్సీవ్ కాలేదని, అందుకే సరోగసీ పద్ధతిని ఆశ్రయించారని హాలీవుడ్ టాక్.
Also Read: మెగా హీరోపై 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఎఫెక్ట్... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు?
Also Read: కల నెరవేరింది... సొంతింట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే
Also Read: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?
Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు... ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే... మహేష్ బాబు
Also Read: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి