RRR New Release Date Effect: మెగా హీరోపై 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఎఫెక్ట్... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు?

'ఆర్ఆర్ఆర్' కోసం రెండు విడుదల తేదీలు ప్రకటించారు. మార్చి 18న వస్తే... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు? ఏప్రిల్ 28న వస్తే ఏయే సినిమాలు వెళ్లొచ్చు? 'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్ ఎన్ని సినిమాల మీద ఉంది?

Continues below advertisement

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను జనవరి 7న విడుదల చేయాలని అనుకున్నప్పుడు... ఆ తర్వాత వారంలో విడుదలకు సిద్ధమైన 'భీమ్లా నాయక్' హీరో పవన్ కల్యాణ్, రచయిత త్రివిక్రమ్, నిర్మాతలను రిక్వెస్ట్ చేసి సినిమాను వాయిదా వేయించారు. అంతకు ముందే మహేష్ బాబు 'సర్కారు వారి పాట'ను వాయిదా వేశారు. అయితే... సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' రాలేదు. కారణాలు అందరికీ తెలుసు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' కోసం రెండు విడుదల తేదీలను ప్రకటించారు. ఇప్పుడు ఏ తేదీకి వస్తే... ఎవరి సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది? ఎన్ని సినిమాలు వాయిదా వేసుకోవాలి? అని చూస్తే...

Continues below advertisement

ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' మార్చి 18న విడుదల చేస్తున్నారని అనుకోండి... ఆల్రెడీ ఆ తేదీకి రావాలని అనుకుంటున్నా గోపీచంద్ 'పక్కా కమర్షియల్', వరుణ్ తేజ్ 'గని' సినిమాలు వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్'తో పోటీకి ఆ రెండు సినిమాలూ మొగ్గు చూపే అవకాశాలు తక్కువ. చిరంజీవి, రామ్ చరణ్ నటించిన 'ఆచార్య'కు మాత్రం ఎటువంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే... ఆ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. మార్చి 18న 'ఆర్ఆర్ఆర్' విడుదల చేస్తే... 'ఆచార్య' విడుదల సమయానికి థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు అవుతుంది కనుక థియేటర్లు లభిస్తాయి. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ అందరూ 'ఆర్ఆర్ఆర్' చూసి ఉంటారు కనుక 'ఆచార్య'కు వస్తారు. ఇక, 'రాధే శ్యామ్'ను మార్చి 18న విడుదల చేయాలని యూనిట్ అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే... 'ఆర్ఆర్ఆర్' ముందుగా ఆ డేట్ బ్లాక్ చేయడంతో వారు ఏం చేస్తారో చూడాలి. 

ఒకవేళ ఏప్రిల్ 28న 'ఆర్ఆర్ఆర్' వస్తే... అప్పటికి 'ఆచార్య' విడుదలై దగ్గర దగ్గర నెల అవుతుంది. కాబట్టి థియేటర్ల సమస్య కూడా ఉండదు. కానీ, 'ఎఫ్ 3' మీద ఎఫెక్ట్ పడుతుంది. నిజం చెప్పాలంటే... నిర్మాత 'దిల్' రాజు ఫిబ్రవరి 25న 'ఎఫ్ 3'ను విడుదల చేయాలని అనుకున్నారు. అప్పుడు 'ఆర్ఆర్ఆర్' సంక్రాంతి బరిలో ఉంది. 'భీమ్లా నాయక్'ను వాయిదా పడటంతో ఆ సినిమాకు ఫిబ్రవరి 25 రిలీజ్ డేట్ ఇచ్చి... ఏప్రిల్ 28కి 'ఎఫ్ 3'ను వాయిదా వేశారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఆ తేదీకి వస్తే తన సినిమాను విడుదల చేయాలని ఆయన అనుకోరు. సో... వాయిదా పడే అవకాశం ఉంది. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', యశ్ 'కె.జి.యఫ్ 2', విజయ్ 'బెస్ట్' సినిమాలు ఏప్రిల్ 14న బాక్సాఫీస్ బరిలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 28కి 'ఆర్ఆర్ఆర్' వచ్చినా... ఆ మూడు సినిమాలు విడుదలై రెండు వారాలు అవుతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. 

పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు', నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు కూడా ఏప్రిల్ 28కి రావాలని ప్లాన్ చేసుకున్నాయి. అయితే... ఇంకా షూటింగ్స్ బ్యాలన్స్ ఉండటంతో ఆ రెండు సినిమాలు అప్పటికి రెడీ కావడం కష్టం అని ఫిల్మ్ నగర్ ఖబర్. మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న... 'ఆర్ఆర్ఆర్' ఎప్పుడు వచ్చినా ఏదో ఒక వరుణ్ తేజ్ సినిమా (గని/ఎఫ్ 3)పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

Also Read: కల నెరవేరింది... సొంతింట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే
Also Read: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?
Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు... ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే... మహేష్ బాబు
Also Read: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?
Also Read: సరోగసి ద్వారా తల్లిదండ్రులైన ప్రియాంక నిక్‌ దంపతులు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola