కార్తీకదీపం జనవరి 22  శనివారం ఎపిసోడ్


ప్రకృతి ఆశ్రమంలో సౌందర్య, ఆనందరావుని చూసినప్పటి నుంచి దీప-కార్తీక్ ఇద్దరూ ఎవరికి వారే మధన పడతారు. మరోవైపు హోటల్ కి కాఫీతాగేందుకు వచ్చిన తల్లిదండ్రులను చూసి కార్తీక్ షాక్ అవుతాడు. మరోవైపు సర్వర్ అప్పారావు గతంలో మోనిత ఇక్కడకు వచ్చిన విషయం చెబుతాడు. శుక్రవారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది...శనివారం ఎపిసోడ్ ఇక్కడే మొదలైంది. అప్పారావు మాటలు విన్న సౌందర్య..  వచ్చింది మోనితేనండి.. ఈ ఊరెందుకు వచ్చిందంటారు అని అంటుంది కంగారుగా. సౌందర్యా నువ్వే అన్నావ్‌గా ప్రశాంతంగా ఉందామని.. ఆ రుద్రాణి గొడవ మరిచిపోదాం అనుకుంటే నువ్వు మళ్లీ ఆ మోనితని గుర్తు చేయకంటాడు ఆనందరావు.  


ఇంతలో అప్పారావు లోపలికి వెళ్లి.. ‘ఏంటి బావా పిలిస్తే రావు’ అంటూనే.. కార్తీక్ చేతిలోని కాఫీ తీసుకుని వచ్చి సౌందర్య, ఆనందరావులకి ఇస్తాడు. కాఫీ తాగి చాలా బాగుంది అంటూనే అప్పారావుతో సరదాగా మాట్లాడతారు ఇద్దరూ. అప్పారావు మోనితతో తీసుకున్న సెల్ఫీ  చూపించి.. ‘మేడమ్ నేను చెప్పినామె ఈమె’ అంటాడు. ఆ ఫొటో చూసి షాక్ అయిన సౌందర్య.. ఆనందరావుకి చూపించి.. కాఫీ డబ్బులు ఇచ్చేసి  చిల్లర నువ్వే ఉంచుకో అప్పారావు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  ‘సౌందర్య ఎందుకు ఆ కంగారు’ అంటాడు ఆనందరావు. ‘మోనితకి సంబంధించిన విషయాలేవి మీరు వినొద్దు, చూడొద్దు అంతే’ అంటూ భర్తని తీసుకుని వెళ్లిపోతుంది.


Also Read: మోనిత బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణిపై దీప ఫైర్.. కార్తీక్ ని సౌందర్య చూస్తుందా… కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్..
కట్ చేస్తే.. మహాలక్ష్మి బాబుని తీసుకొచ్చి దీపకు ఇస్తుంది. ‘ఇబ్బంది పెట్టాడా మహాలక్ష్మీ’ అని దీప అడిగితే.. ‘లేదు దీపా పాలు పట్టించాను, నిద్రపోయాడు.. కానీ ఆ రుద్రాణి ఎక్కడ మా ఇంటికి వస్తుందో.. బాబుని ఎక్కడ చూస్తుందో అని భయపడుతూనే ఉన్నాను తెలుసా.. మీరు ఆ రుద్రాణి సమస్య నుంచి తొందరగా బయటపడితే బెటర్’ అంటూ బాబుని అప్పగించి  వెళ్లిపోతుంది. దాంతో దీప ఆలోచనలో పడుతుంది. ఆ రుద్రాణి ఆట కట్టించాలి.. అసలే వడ్డీ కట్టాల్సిన గడువు తీరిపోయింది.. ఇంకా కట్టలేదు.. ముందు ఆ పనిలో ఉండాలని మనసులో అనుకుంటూ.. ‘నాన్నాఆనంద్‌ నువ్వు బొజ్జో.. నేను ఇప్పుడే వస్తాను’ అంటూ బయటికి వెళ్తుంది దీప. మరోవైపు కార్తీక్ అప్పారావుతో.. నాకు సెలవు కావాలి అప్పారావు ఓనర్‌కి చెబుతావా అంటాడు. బావా నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావని ఇప్పుడు సెలవు కావాలి. .అలా కాదు కానీ.. నీకు కడుపు నొప్పి వచ్చిందన్నమాట .. నువ్వు వెళ్లిపోయావన్న మాట అంటూ తన ఐడియాతో కార్తీక్‌ని ఇంటికి పంపిస్తాడు. ఇక సౌందర్య, ఆనందరావులు.. వెళ్తూ వెళ్తూ కాఫీ గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరూ ఒకేసారి.. ఆ కాఫీ మన వంటలక్క దీప పెట్టినట్లే ఉంది కదా అనుకుంటారు. అక్కడకు వెళ్లి కనుక్కుందాం పద అనుకుంటారు.


Also Read: జగతిని లోపలకు రమ్మని పిలిచి… రిషి దేవయానికి షాకివ్వబోతున్నాడా, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్..
సీన్ కట్ చేస్తే పిల్లిగడ్డం రౌడీ.. బాబుని ఊయల్లో వేసి ఊపుతుంటాడు.  దీప గేట్ తోసుకుంటూ ‘రుద్రాణీ’ అని అరుస్తూ ఎంట్రీ ఇస్తుంది. అరవకు దీపా అన్న రుద్రాణితో బాబుని ఎత్తుకొచ్చి తప్పుచేశావ్ నీకు డబ్బులు ఇస్తాం అన్నాం.. అయినా బాబుని ఎత్తుకొచ్చావ్ అని దీప మండిపడుతుంది. 3 లక్షల 20 వేలకు రెండు రూపాల చొప్పు ఆరు వేల నాలుగు వందలు తెచ్చి.. రంగరాజుని తీసుకెళ్లు అంటుంది రుద్రాణి. బాబుని తీసుకునే ప్రయత్నం చేసిన దీపని చేత్తోనే ఆపుతుంది రుద్రాణి. కాదు కూడదు అంటే ఊరిలో నా మనుషులందరినీ పోగేసి నీ పిల్లల్ని కూడా ఎత్తుకుని రమ్మంటా జాగ్రత్తా అని వార్నింగ్ ఇస్తుంది . దాంతో దీప వాడికి పాలు పట్టండి, నేను వడ్డీ డబ్బులు తీసుకొస్తాను అంటూ మౌనంగా వెళ్లిపోతుంది. 


Also Read: రుద్రాణి ఆగడాలకి సౌందర్య చెక్ పెట్టనుందా.. దీప-కార్తీక్ ఇప్పుడేం చేయబోతున్నారు
సౌందర్య, ఆనందరావు తిరిగి హోటల్‌కి వెళ్తారు. ఓనర్ దగ్గరకు వెళ్లి.. ఇక్కడ కాఫీ కలిపింది ఎవరో చెబుతారా అని అడగగానే.. ఆ ఓనర్‌కి దీప గతంలో కోరిన కోరిక గుర్తొస్తుంది. ‘నేను ఇక్కడ పని చేస్తున్నట్లు ఆ రుద్రాణికి తెలియకుండా ఉంటే చాలండీ’ అనే దీప డైలాగ్ గుర్తొచ్చి.. ‘సాంబయ్య మేడమ్’ అని అబద్ధం చెబుతాడు. (అమ్మా.. నా దగ్గరా మీ వేషాలు? దీపమ్మ గురించే అడుగుతారా? మీరు ఆ రుద్రాణి మనుషులని నాకు ముందే అనుమానం వచ్చింది.. అని అనుకుంటాడు ఓనర్ మనసులో). ఇక కార్తీక్ ఓ కూరగాయల వ్యక్తి దగ్గరకు వెళ్లి.. నాకో సాయం కావాలి.. నువ్వు ఆ ఆశ్రమంలో కూరగాయలు అమ్ముతావు కదా.. అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతుల వివరాలు కావాలి అంటాడు. ‘అలా చెప్పకూడదు సార్ సారీ సార్’ అంటాడు ఆ కూరగాయలు అమ్మేవాడు. ఇక దీప రంగరాజు అలియాస్ ఆనంద్  అలియాస్ మోనిత కొడుకు గురించి ఇంట్లో ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. ఎపిసోడ్ ముగిసింది...


Also Read: తండ్రిని తల్లి దగ్గరకు పంపించేసి రిషి ఒంటరి కానున్నాడా.. గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్..
సోమవారం ఎపిసోడ్ లో
కార్తీక్ దగ్గరకు వచ్చిన మహాలక్ష్మి... రుద్రాణి బాబుని తీసుకెళ్లిందని చెబుతుంది. కార్తీక్ రుద్రాణిని నిలదీయడంతో వడ్డీ చెల్లించి బాబుని తీసుకెళ్లగలరు అంటుంది. హోటల్ యజమానిని అడ్వాన్స్ అడగడంతో వంటమనిషి అడ్వాన్స్ తీసుకెళ్లింది..మీ ఇద్దరూ కూడబలుక్కుని అడుగుతున్నారా అంటాడు. దీంతో కార్తీక్ కి దీపపై డౌట్ వచ్చినట్టే ఉంది... 


Also Read: సౌందర్య-ఆనందరావుని ఆ పరిస్థితుల్లో చూసిన దీప-కార్తీక్ ఏం చేయబోతున్నారు .. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
Also Read: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి