కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అనుమతి లేకుండా తన పేరు వాడుకుంటున్నారంటూ.. తన తల్లితండ్రులతో పాటు మరి 11 మందిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తమిళనాట సంచలనంగా మారింది. విజయ్ అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. విజయ్ తండ్రి వెటరన్ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ సొంతంగా రాజకీయ పార్టీను మొదలుపెట్టారు. దానికి 'ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం' అనే పేరు పెట్టారు. 


Also Read:ఈ చిత్రంలోని హీరోయిన్ ఎవరో చెప్పుకోగలరా..?


ఈ పార్టీకి చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తుంటే.. ఆయన భార్య శోభా చంద్రశేఖర్ ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పద్మనాభన్ పార్టీకి లీడర్ గా వ్యవహరిస్తున్నారు. గతేడాది ఈ పార్టీలో విజయ్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ విజయ్ అందులో నిజం లేదని.. తండ్రి పెట్టిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఆ పార్టీకి సంబంధించి తన ఇన్వాల్వ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఉండదని తేల్చిచెప్పారు. తన అభిమానులను ఈ పార్టీలో జాయిన్ అవ్వొద్దని కూడా చెప్పారు విజయ్.


తన తండ్రి చేసే పొలిటికల్ స్టేట్మెంట్స్ తో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఏకంగా తల్లితండ్రులపై ఫిర్యాదు చేశారు. తన తల్లితండ్రులు విజయ్ పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని.. తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళ సినీ, రాజకీయ వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. 


ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కోలీవుడ్ లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం విజయ్ 'బీస్ట్' అనే సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీని తరువాత తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు విజయ్. 


Also Read: కనులకు తెలియని ఓ కలలా.. సిద్ శ్రీరామ్ మరో మెలోడీ.. సుమంత్ పాటకు మహేష్ బాబు ఫిదా!


Also Read: బుల్లితెరపై మహేష్‌తో ఎన్టీఆర్ గేమ్.. టీఆర్పీ ఆకాశాన్నంటుతుందా?


Also Read: అభిమానికి క్యాన్సర్... వీడియోకాల్ చేసి మాట్లాడిన ప్రభాస్


Also Read: హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్.. కానీ సినిమా రిలీజ్ పక్కా..