ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో జునియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పటికే ఆ  ప్రోగ్రామ్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. మొదటి ఎపిసోడ్ కు అతిధిగా రామ్ చరణ్ ను తీసుకొచ్చారు. ఆ ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యింది. చెర్రీ-యంగ్ టైగర్ ముచ్చట్లు, చెర్రీ ఆట వీక్షకులను టీవీకి కట్టిపడేసాయి. ఆ తరువాత నుంచి వారంలో ఒకసారి ప్రత్యేక అతిధులను పిలిచి ఆడిస్తున్నారు.  రాజమౌళి, కొరటాల శివ కూడా ఇందులో పాల్గొన్నారు.  వారి ఎసిపోడ్ కూడా ప్రసారం కానుంది. కాగా మరొక తాజా బజ్ ఏంటంటే... ఈ కార్యక్రమానికి త్వరలో ప్రిన్స్ మహేష్ కూడా రాబోతున్నాడట. 


దసరాకు పెద్దగా ప్లాన్ చేస్తోందట ఎవరు మీలో కోటీశ్వరుడు టీమ్. ప్రిన్స్ ను, యంగ్ టైగర్ ను ఒకే స్క్రీన్ పై చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. చెర్రీలాగే మహేష్ కూడా కార్యక్రమానికి వచ్చి గేమ్ ఆడబోతున్నాడట. త్వరలో ఈ షూట్ కూడా ప్రారంభమవుతుందని సమాచారం. ఇదే జరిగితే ఆ ఎపిసోడ్ కు టీఆర్పీ రేట్లు  అమాంతం ఆకాశానికి ఎగరడం ఖాయం అని అంచనా. చెర్రీ వచ్చిన ఎపిసోడ్ కే టీఆర్పీ ఓ స్థాయిలో పెరిగింది. ఇక టాలీవుడ్ అందగాడు ప్రిన్స్ మహేష్ వస్తే తెలుగు ప్రేక్షకులకు పండగే. ఇద్దరు సూపర్ స్టార్లను ఒకే వేదికపై చూసే అవకాశాన్ని ఏ తెలుగు సినీ ప్రియుడు వదిలేసుకోడు. త్వరలోనే ప్రోమోని వదిలే అవకాశం కూడా కనిపిస్తోంది. 


ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలో ఓ పాట కోసం త్వరలో స్పెయిన్ వెళ్లనున్నారట. ఈలోపే ఎవరు మీలో కోటీశ్వరుడు షూట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 


2022 సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలో సర్కారు వారి పాట కూడా ఒకటి. గతేడాది సరిలేరు నీకెవ్వరూ సినిమాతో భారీ హిట్ కొట్టాడు మహేష్. సర్కారు వారి పాట సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి సీజన్ ని ఈ సినిమా క్యాష్ చేసుకుంటుందని సినీ విమర్శకుల అభిప్రాయం. 


Also read: ఆ పిలగాడి వీపుపై సంతకాల మేళా... అదో ప్రపంచ రికార్డు


Also read: అక్కడ ఎవరినైనా విజిలేసి పిలుస్తారు... పేర్లు కూడా ఈల శబ్ధాలే...


Also read: పిల్లలకు రోజుకో అరస్పూను నెయ్యి తినిపించండి... మతిమరుపు దరిచేరదు