ఎవరినైనా పేరుతోనే పిలుస్తాం... సోనీ, జానీ, రాధ... ఇలా కానీ ఆ గ్రామంలో మాత్రం ఈలేసి ఒకరినొకరు పిలుచుకుంటారు. అందుకే ఆ విలేజ్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఆ గ్రామం పేరు కాంగ్ థాన్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ప్రతి గ్రామస్థుడికి ప్రత్యేకంగా ఈల పాటలు ఉంటాయి. అవే వారి పేర్లు. ఆ ఈల శబ్ధంతోనే అతడిని పిలుస్తారు. బిడ్డ గర్భంలో ఉండగానే ఆ బిడ్డకు ప్రత్యేకంగా ఓ ఈల శబ్ధాన్ని ఎంపిక చేస్తారు తల్లిదండ్రులు. ఆ ట్యూన్  తోనే గ్రామస్థులంతా ఆ బిడ్డను పిలుస్తారు. ఆ ఈలను ‘జింగర్వయి లాబీ’ అంటారు. అంటే వారి భాషలో ‘అమ్మ ప్రేమ పాట’అని అర్థం. అలా అని వారికి మరో పేరు ఉండదనుకోకండి. స్కూళ్లలో నమోదు చేయించేందుకు మరో పేరు ఉంటుంది. ఆ పేర్లతో ఎవరూ పిలుచుకోరు. 


ఇక ఈల పాటల విషయానికి వస్తే ఇందులో రెండు రకాల పాటలు ఉంటాయి. చిన్న ఈలతో ఇంట్లో ముద్దుగా పిలుచుకుంటారు. కాస్త పెద్దగా ఉన్న ఈల పాటతో బయటివాళ్లు పిలుస్తారు. ఈ గ్రామంలో ప్రస్తుతం 700 మంది జనాభా ఉన్నారు. 


అసలెందుకు ఈల పేర్లు?
ఈ గ్రామంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఇది. అప్పట్లో ఈ గ్రామస్థులు జంతువుల వేటతో జీవనం సాగించారు. వేటలో తోటి వారిని అప్రమత్తంగా ఉంచేందుకు పేర్లతో పిలిస్తే, జంతువులు మనుషులను పోల్చేసేవి. అందుకే ఇలా ఈల శబ్ధాల పేర్లు పెట్టుకుని, తోటివారిని అప్రమత్తం చేయడం ప్రారంభించారు. అలా సంప్రదాయంగా వస్తోంది. అలాగే మనుషుల పేర్లతో చేతబడి చేసే అవకాశం ఉందని వారి నమ్మకం. అందుకే అసలు పేర్లు చెప్పరు. ఆ పేర్లతో ఎవరినీ పిలువనివ్వరు. 


ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే ప్రపంచపర్యాటక సంస్థ ‘బెస్ట్ టూరిజం విలేజ్’ పోటీని నిర్వహిస్తోంది.  ఆ పోటీలో భారత్ నుంచి మూడు గ్రామాలు ఎంట్రీ పొందాయి. వాటిలో ఒకటి ఈ ‘కాంగ్ థాన్’. అంతేకాదు తెలంగాణ నుంచి ‘భూదాన్ పోపంచల్లి’ కూడా పోటీ ఉంది. అలాగే మధ్యప్రదేశ్ కు చెందిన చారిత్రాత్మక గ్రామం ‘లద్పురా ఖాస్’ కూడా చోటు సంపాదించింది. 


Also read: పచ్చి ఉల్లిపాయతో ఆ రోగానికి చెక్ పెట్టొచ్చు


Also read: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్


Also read: ఈ నల్లకోడి ప్రత్యేకతలు తెలిస్తే.. తప్పకుండా గుటకలు వేస్తారు