పాన్ ఇండియా స్టార్ ఎదుగుతున్న ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. షూటింగులలో బిజీగా ఉండే ప్రభాస్ ఖాళీ దొరికినప్పుడు కొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడు. కానీ అవి పెద్దగా బయటకు తెలియవు. ఈ మధ్యన తన అభిమాని క్యాన్సర్ బాధపడుతుందని తెలిసి ఆమె వీడియో కాల్ లో మాట్లాడి సంతోషపెట్టాడు. ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది.
శోభితా అనే పాపకి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆమెకు క్యాన్సర్. ప్రభాష్ అంటే చాలా ఇష్టం. ఓ స్వచ్ఛంద సంస్థ టీమ్ ఈ విషయాన్ని ప్రభాస్ కు చేరేలా చేశారు. ఆమెతో మాట్లాడేందుకు అంగీకారం తెలిపాడు ప్రభాస్. వీడియో కాల్ తో ఆమెను పలకరించాడు. ఫేవరేట్ హీరోని చూసిన శోభితా చాలా ఆనంద పడింది. గతంలో కూడా భీమవరంలో 20 ఏళ్ల అభిమానికి క్యాన్సర్ అని తెలిసి అతనితో నేరుగా మాట్లాడి సంతోషపెట్టాడు. ప్రభాస్ తో మాట్లాడాక 20 రోజుల పాటూ ఆ పిల్లాడు జీవించాడని అతని తండ్రి మీడియాకు చెప్పాడు. ప్రభాస్ చాలా సార్లు ఇలా అభిమానులను కలిసి వారితో ముచ్చటించేవాడు.
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. సంక్రాంతికి రాధేశ్యామ్ విడుదలవ్వబోతోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా సలార్ తరువాత విడుదలవుతుంది. ఆ తరువాత ఆదిపురుష్ విడులయ్యే అవకాశం ఉంది. ఈ మూడింటి తరువాత నాగ్ అశ్విన్ తో సినిమా కమిట్ అయ్యాడు ప్రభాస్. దీన్ని ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో తీస్తారని టాక్. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ మొత్తం దాదాపుగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేస్తున్నారట. ప్రత్యేక సెట్లను కూడా ఏర్పాటు చేయడం ప్రారంభించారట.
Also read: ఆ పిలగాడి వీపుపై సంతకాల మేళా... అదో ప్రపంచ రికార్డు